ఇంటి ముందు ముగ్గు వేస్తే, లక్ష్మీదేవి గడప దాటదు
హిందూ ధర్మంలో ముగ్గుకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఏ ముగ్గును ఎక్కడ, ఎప్పుడు వేయాలి అనేది కూడా ఉంది. ఇంటి ముందు, లేక గడప పైన, గేటు ముందు ముగ్గులో భాగంగా గీసే రెండు అడ్డ గీతలు ఇంటిలోనికి దుష్టశక్తులను రాకుండా నిరోధిస్తాయి. ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళకుండా చూస్తాయి. ముగ్గువేసి దానికి నాలుగు వైపులా రెండేసి అడ్డగీతలు గీస్తే, అక్కడ శుభకార్యాలు, మంగళకరమైన పనులు జరుగుతున్నాయని గుర్తు. పండుగల సమయంలో ఈ విధంగా ఖచ్చితంగా వేయాలి.
ఏ దేవత పూజ చేస్తున్నా దైవాన్ని ఉంచే పీట మీద మధ్యలో చిన్న ముగ్గు వేసినా, నాలుగు వైపులా రెండేసి గీతలను తప్పక గీయాలి. నక్షత్రం ఆకారం వచ్చేలా గీతలతో వేసిన ముగ్గు భూత, ప్రేత, పిశాచాలను ఆ దరిదాపులకు రాకుండా చూస్తుంది. అంతేకాదు, మనం వేసే పద్మాలు, చుక్కల ముగ్గులలో కూడా మనకు తెలియని అనేక కోణాలు దాగి ఉన్నాయి. అవి కేవలం గీతలే కాదు, యంత్రాలు కూడా. యంత్ర, తంత్ర శాస్త్ర రహస్యాలతో కూడి ఉండడం వలన మనకు హాని కలిగించే చెడ్డశక్తులను దరిచేరనీయవు. అందుకే ఏ ముగ్గునైనా తొక్కకూడదు. తులసి మొక్క దగ్గర అష్టదళపద్మం వేసి దీపారాధాన చేయాలి.
యజ్ఞయాగాదులలో యజ్ఞగుండం మీద నాలుగు గీతలతో కూడిన ముగ్గులేయాలి. దైవకార్యలలో కూడా నాలుగు గీతలతో కూడిన ముగ్గులు వేయాలి. నూతన వధూవరులు తొలిసారి భోజనం చేసే సమయంలో వారి చుట్టుప్రక్కల లతలు, పుష్పాలు, తీగలతో కూడిన ముగ్గులు వేయాలి.
దేవతా రూపాలను, ఓం, స్వస్తిక్, శ్రీ గుర్తులను పోలిన ముగ్గులు వేయకూడదు. ఒకవేళ వేసినా వాటిని తొక్కకూడదు. ఏ స్త్రీ అయితే దేవాలయంలోనూ, అమ్మవారు, శ్రీ మహావిష్ణు ముందు నిత్యం ముగ్గులు వేస్తుందో, ఆ స్త్రీకి 7 జన్మలవరకు వైధవ్యం రాదని, సుమంగళిగానే మరణిస్తుందని దేవి భాగవతం, బ్రహ్మాండ పురాణం చెబుతున్నాయి. పండుగ వచ్చిందా కదా అని, నడవడానికి చోటు లేకుండా వాకిలంతా ముగ్గులు పెట్టకూడదు. అంతేకాదండోయ్! మనం రోజూ ముగ్గులు వేయలేక పెయింటింగ్ వేస్తాం. దాన్ని ముగ్గుగా శాస్త్రం అంగీకరించదు. ఏ రోజుకారోజు బియ్యపుపిండితో ముగ్గు పెట్టాలి. నిత్యం ఇంటి ముందు, వెనుక భాగంలో, తులసి మొక్క దగ్గర, దీపారాధన చేసే ప్రదేశంలో ముగ్గు వేయాలి.
ముగ్గు అంటే అదో పాజిటివ్ సైన్, దైవ శక్తులను ఇంట్లోకి ఆకర్షిస్తుంది.
ముగ్గులు ఒకప్పుడు సూచకాలుగా పనిచేసేవి. పూర్వం రోజూ సాధువులు, సన్యాసులు, బ్రహ్మచారులు ఇల్లిల్లూ తిరిగి బిక్ష అడిగేవారు. ఏ ఇంటి ముందైనా ముగ్గు లేదంటే ఆ ఇంటికి వేళ్ళేవారు కాదు. వారే కాదు భిక్షగాళ్లు కూడా ముగ్గు లేని ఇళ్ళకు వెళ్ళి భిక్షం అడిగేవారుకాదు. ముగ్గు లేదంటే అక్కడ అశుభం జరిగిందని గుర్తు. అందుకే మరణించిన వారికి శ్రాద్ధకర్మలు చేసే రోజున ఉదయం ఇంటిముందు ముగ్గు వేయరు. శ్రాద్ధకర్మ పూర్తైన వెంటనే, అది మధ్యాహ్నమైనా ముగ్గు వేస్తారు. ముగ్గులు వెనుక సామాజిక, మానసిక, ఆరోగ్య, ఆధ్యాత్మికమైన అనేక రహస్య కోణాలు దాగి ఉన్నాయి. మన ఆచరించే ఏ ఆచారమూ మూఢనమ్మకం కాదు. మన ఆచార, సంప్రదాయాలన్నీ అనేకానేక అర్ధాలు, పరమార్ధాలతో కూడినవి. అందుకే ఏ ఇంటి ముందు ముగ్గు లేదో... ఆ ఇంట్లో ఇల్లాలికి ఏమీ తెలియదని అర్ధం.
SWASTIKA & THE IMPRESSIONS OF THE FEET OF GODDESS LAKSHMI ON THE MAIN DOOR
It is a great Indian tradition to pay attention to the main door. Many households sports ‘Rangoli’ at the entrance. In Maharashtra and other states too, we find drawings of ‘swastika’ and ‘feet of Lakshmi’ the goddess of wealth near the door. In South India’ Rangoli’ is drawn in intricate fashion with wet wice flour (Kolam). This practice too is closely related to Feng Shui.
Attractive ‘Rangoli’ attracts good cosmic vibrations. Don’t we focus our attention on an attractive object or a beautiful piece of art? The basic Feng- Shui principle is’where attention goes, energy flows’. Our ancestors too realized the importance of this aspect. They performed ‘umbara pujan’ i.e. worshipping the ‘threshhold’ of the house to keep the path of good energies open and to shun the evil ones.
However, we tend to draw ‘Rangoli’ rather thoughtlessly. There is a place for everything and the footprints of Lakshmi and Swastika emblems are no exceptions. With the generous blessings of my Siddhaguruji, I am disclosing the secret of the right place for these two symbols. On the left side of the main door frame, nine inches above the floor, draw swastika and Lakshmi’s foot prints. Repeat the same on the right side. Today most apartments have a safety door. So these should be drawn between the safety door and main door on the door frame. Do not draw these symbols on the floor as they are stamped upon by visitors. These are potent symbols and should not be crushed under anyone’s feet. This should be followed rigidly as today’s landings are narrow. Entrance doors are small and apartments are too close to each other to have any open space.
Swastika is a very powerful symbol and is associated with Ganesh and overall well- being. Most people hurriendly draw the symbol which leaves it incomplete and thus is meaningless. It is essential to make a note of this. The wings of this symbol should appear rotating in the right direction i.e. clockwise.
The right side of the Swastika is the universal creation and progress and the left cannotes destruction. Swastika should always be drawn in red or orange colours. Usually, we tend to draw Swastika on Diwali day to usher in a prosperous new year and forget it till the next Diwali. It is ideal to draw a Swastika, everyday using ‘vermillion’ or ‘sindoor’ on the main door to activate positive energy and protect us from harmful energy. Use the ring finger while drawings and keep faith that the symbol is going to be beneficial to you.
0 Comments