Ad Code

గంగా మాత జ‌యంతి - Mother Ganga's birth anniversary

గంగా మాత జ‌యంతి


తుంగ తరంగే గంగే

జయ తుంగ తరంగే గంగే

దూరీకృత పాప సమూహే 

పూరిత కచ్ఛప తుచ్ఛ గ్రాహీ

తుంగ తరీంగే గంగే

పరమహంస గురు భణిత చరిత్రే 

బ్రహ్మా విష్ణు శంకర నుతి పాత్రే 

తుంగ తరంగే గంగే 

సదాశివ బ్రహ్మేంద్రులు

గంగ పరమ పవిత్రమైన నది. 

ఆ నదిలో స్నానం చేసినంత మాత్రానే అన్ని పాపాలు తొలగి పోతాయన్నది హిందువుల నమ్మకం. అసలు గంగ ఎవరు అన్న దానికి సంబం ధించి అనేక కథలున్నాయి.

ఆమె మేనా, హిమవంతుల పెద్ద కుమార్తె అనీ, పార్వతీ దేవికి సోదరి అనీ 

విష్ణుమూర్తి పాదాల నుంచి ఉద్భవించిందని వేర్వేరు కథలు ఉన్నాయి. 

విష్ణు పాదోద్భవి అయిన ఆ గంగను 

బ్రహ్మ దేవుడు తన కమండలంలోకి తీసుకున్నాడని కథనం.

భగీరథుని వెంట ఆమెను బ్రహ్మ పంపాడనేది ఒక కథ. 

ఆ సమయంలో ఆమె తాను భూమి మీదకు రాగలనని అయితే తనను ఆపి తట్టుకోగల శక్తి గల వాడు ఉండాలని చెప్పినట్లుపురాణాలు చెబుతున్నాయి. భగీరథుడు అందుకు సమర్థుడు శివుడని ఎంచి ఆయ నను ప్రసన్నం చేసుకోగా ఆయన అందుకు సిద్ధపడ్డారు.

అలాగ శివుని జటాజూటంలోనికి గంగ 

ఉరికి వచ్చింది. శివ స్పర్శతో మరింత పావనమైంది. ఆ గంగలోని ఏడు బిందువులను శివుడు భూమి మీదకు వదిలాడు. ఆ బిందువులు మొదట పడిన చోటు బిందు సరస్సు. అక్కడి నుంచి గంగా నది ప్రవ హిస్తూ దారిలో జహ్ను ముని యజ్ఞశాలను ముంచెత్తింది. దానితో ముని కోపించి మొత్తం నదీ ప్రవాహాన్ని తాగి వేశాడు. అయితే భగీర థుడు ప్రార్థించగా తన చెవి నుంచి విడిచిపెట్టాడు. జహ్ను మహర్షి తాగి విడిచి పెట్టినది కనుక ఆమెకు జాహ్నవి అనే పేరు వచ్చింది. 

గంగా నది జహ్నుని చెవి నుంచి బయటకు వచ్చిన రోజు వైశాఖ మాసము అప్పటి నుంచి నిరాటంకంగా ఆమె ప్రవహించింది. కనుక ఆ రోజును 

ఆమె జయంతిగా జరుపుకొంటుంటారు. 

ఈ జయంతినే జాహ్నవీ జయంతి, గంగా జయంతి అని కూడా అంటారు. 

ఈ రోజున గంగా నదిలో స్నానం చేయడం, పూజ నిర్వహించ ఆచారం కూడా ఉన్నాయి.

అలాగే శర్కర సప్తమి, నింబ సప్తమి, అనోదన సప్తమి, ద్వాదశ సప్తమి వ్రతాలు, పర్జన్య పూజ వంటివి చేసే ఆచారం ఉంది. గంగాదేవి మనుష్య రూపంలో భూమి మీద సంచరిండం వంటి కథలూ ఉన్నాయి. 

ఒక సారి ఆమె భూమి మీద మనుష్య రూపంలో సంచరిస్తుండగా శంతన మహారాజు చూసి మోహించి వివాహం చేసుకోవడం కూడా జరిగింది. వారికి పుట్టిన పిల్లల్లో ఒకరే మహా భారతంలో ప్రముఖ పాత్ర వహించిన కురు పితామహుడు భీష్ముడు. ఒక గంగా దేవి శివుని భార్య అన్న అపప్రధ కొందరిలో ఉంది. 

గంగను శివుడు ధరించాడు కాని ఆమెను వివాహం చేసుకోలేదు. 

ఆమె ఆయనకు భార్య కాదు.

మన దేశంలో గంగా నది చాలా దూరం ప్రవహించింది. ఆ నదీ తీరాన ఎన్నో పుణ్య క్షేత్రాలు ఉన్నాయి.

వాటిలో కాశీ ప్రముఖమైనదని 

వేరే చెప్పనక్కర్లేదు. 

ఇక గంగా, యమునా, అంతర్వాహిని అయిన సరస్వతితో కలిసే సంగమం త్రివేణీ సంగమంగా ప్రసిద్ధం  

అది మరో అతి పవిత్రమైన తీర్థ క్షేత్రం.

గంగా నదిని స్తుతిస్తూ ఎన్నో గ్రంథాలు, శ్లోకాలు వెలవడ్డాయి. 

ఉత్తుంగ తరంగ అయిన గంగను స్తుతిస్తూ ఆది శంకరులు చేసిన గంగా స్తోత్రం అద్భుతం.


గంగా, గంగా, గంగా


సర్వేజనాః సుఖినోభవంతు! సమస్త సన్మంగళాని భవంతు!! శుభమస్తు!!!
గోమాతను పూజించండి, గోమాతను సంరక్షించండి. జై గోమాత.
ఓం గం గణపతయే నమః
శ్రీరామ రక్ష  సర్వజగద్రక్ష
జై శ్రీరామ్
శ్రీ మాత్రే నమః
ఓం నమః శివాయ
ఓం నమో భగవతే రుద్రాయ
ఓం నమో నారాయణాయ
ఓం నమో భగవతే వాసుదేవాయ



Mother Ganga's birth anniversary


Ganga is the wave of sleep

Victory to Tunga wave Ganges

is a bunch of distant sin

Filled Kachapa is despicable

Ganges that are flowing in sleep

 History is the greatest teacher

 Brahma Vishnu Shankara Nuthi Patre 

Ganga is the wave of sleep

- Sadashiva Brahmendras

Ganga is the most sacred river.

Hindus believe that all sins will be washed away just by bathing in that river. There are many stories regarding who Ganga really is

She is Mena, the eldest daughter of Himavantu and the sister of Parvathi Devi

There are different stories that Vishnu Murthy has emerged from the feet.

The Ganga that is the foot of Vishnu

The story is that God Brahma has taken into his lotus.

It is a story that Brahma sent her along with Bhageerath.

Legends says she can come to earth at that time but there must be someone who can stop her. Bhageeratha is capable of that. By choosing Lord Shiva, he made me happy, he prepared for that.

And Ganga into the group of Shiva

The hangover has come. Became more sacred with the touch of shiva. Shiva released seven drops of the Ganga on the earth. Drop lake where the drops first fell. River Ganga flowing from there and drowned Jahnu Muni Yagnasha on the way. He drowned it and drank the entire river flow. But Bhagira Thudu left his ear when he prayed. Jahnu Maharshi got the name Jahnavi because she drank and left.

The day river Ganga came out of Jahn's ear Vaisakha month since then she has been flowing uninterrupted. So that's the day I'm going to be

She will be celebrated as her birthday.

This birth anniversary is also known as Jahnavi Jayanthi and Ganga Jayanthi.

On this day, there are rituals of bathing and performing pooja in Ganga river.

Also there is a ritual of doing Sarkara Saptami, Nimba Saptami, Anodana Saptami, Twelve Saptami Vratas, Parjanya Pooja There are stories like Ganga Devi in human form on the earth like wandering.

Once she was walking on earth in human form, Shantana Maharaju was mesmerized and married. Among the children born to them, only one of the children played a prominent role in Mahabharatam is the father of Kuru Bheeshma. There is a mistake in saying that a Ganga devi is the wife of Shiva.

Shiva wore Ganga but did not marry her.

She is not his wife

River Ganga has flowed a long distance in our country. There are many sacred places along the river bank.

Kashi is the famous one of them

Nothing else needs to be said.

The society that joins Ganga, Yamuna and Saraswati, is known as Triveni Sangam

That is another very sacred pilgrimage site.

Many books and slokas have been spent praising river Ganga.

Adi Shankar's Ganga stotram while praising Ganga which is a wave of excitement is wonderful.





Post a Comment

0 Comments