గ్రామ దేవతల పేర్లు
పార్వతి అమ్మోరు (అమ్మవారు )గా గ్రామాలలో గ్రామదేవతయై గ్రామాలను రోగాల బారినుండి రక్షిస్తుందని బలమైన నమ్మకం.
ఈ అమ్మోరు మొత్తం 101 మంది అక్కాచెల్లెళ్లు అని వీరందరికి ఒకేఒక్క తమ్ముడు పోతురాజు అని అంటారు.
గ్రామదేవతలు 101 మంది అక్కాచెల్లెళ్ల పేర్లు:
1. పాగేలమ్మ
2. ముత్యాలమ్మ
3. గంగమ్మ
4. గంగానమ్మ
5. బంగారమ్మ
6. గొంతెమ్మ
7. సత్తెమ్మ
8. తాళమ్మ
9. చింతాలమ్మ
10. చిత్తారమ్మ
11. పోలేరమ్మ
12. మావుళ్లమ్మ
13. మారెమ్మ
14. బంగారు బాపనమ్మ
15. పుట్టానమ్మ
16. దాక్షాయణమ్మ
17. పేరంటాలమ్మ
18. రావులమ్మ
19. గండిపోచమ్మ
20. మేగదారమ్మ
21. ఈరినమ్మ
22. దుర్గమ్మ
23. మొదుగులమ్మ
24. నూకాలమ్మ (అనకాపల్లి ,విశాఖజిల్లా )
25. మరిడమ్మ
26. నేరెళ్లమ్మ
27. పుంతలో ముసలమ్మ (మెయ్యెరు ,అత్తిలిదగ్గర ,పశ్చిమగోదావరిజిల్లా )
28. మాచరమ్మోరు
29. మద్ది ఆనాపా అమ్మోరు
30. సొమాలమ్మ
31. పెద్దయింట్లమ్మ
32. గుర్రాలక్క (అంతర్వేది ,తూర్పుగోదావరిజిల్లా గుర్రాలమ్మ )
33 . అంబికాలమ్మ
34. ధనమ్మ
35. మాలక్షమ్మ
36. ఇటకాలమ్మ
37. దానాలమ్మ
38. రాట్నాలమ్మ
39. తలుపులమ్మ
40. పెన్నేరమ్మ
41. వెంకాయమ్మ
42. గుణాళమ్మ
43. ఎల్లమ్మ (విశాఖపట్నం )
44. పెద్దమ్మ
45. మాంటాలమ్మ
46. గంటాలమ్మ
47. సుంకులమ్మ
48. జంబులమ్మ
49. పెరంటాలమ్మ
50. కంటికలమ్మ
51. వణువులమ్మ
52. సుబ్బాలమ్మ
53. అక్కమ్మ
54. గనిగమ్మ
55. ధారాలమ్మ
56. మహాలక్షమ్మ
57. లంకాలమ్మ
58. దోసాలమ్మ
59. పళ్ళాలమ్మ (వానపల్లి ,తూర్పుగోదావరిజిల్లా )
60. అంకాళమ్మ .
61. జోగులమ్మ
62. పైడితల్లమ్మ
63. చెంగాళమ్మ
64. రావులమ్మ
65. బూరుగులమ్మ
66. కనకమహాలక్ష్మి (విశాఖపట్నం )
67. పోలమ్మ
68. కొండాలమ్మ
69. వెర్నిమ్మ
70. దే శిమ్మ
71. గరవాలమ్మా
72. గరగలమ్మ
73. దానెమ్మ
74. మహాంకాళమ్మ
75. వేరులమ్మ
76. మరిడమ్మ
77. ముళ్ళ మాంబిక
78. యలారమ్మ
79. వల్లూరమ్మ
80. నాగులమ్మ
81. వేగులమ్మ
82. ముడియలమ్మ
83. రేణుకమ్మ
84. నంగాలమ్మ
85. చాగాలమ్మ
86. నాంచారమ్మ
87. సమ్మక్క
88. సారలమ్మ
89. మజ్జిగౌరమ్మ
90. కన్నమ్మ -పేరంటాలమ్మ
91. రంగమ్మ -పేరంటాలమ్మ
92. వెంగమ్మ -పేరంటాలమ్మ
93. తిరుపతమ్మ
94. రెడ్డమ్మ
95. పగడాలమ్మ
96. మురుగులమ్మ (బండారులంక ,తూర్పుగోదావరిజిల్లా )
97. కుంచమ్మ విశాఖపట్నంలో
98. ఎరకమ్మ
99. ఊర్లమ్మతల్లి
100. మరిడమ్మ
101. సుంకాలమ్మవ్వ ఉన్నారు
నుసకపల్లి, పామర్రమండలం తూర్పుదోదావరిజిల్లాలోని గ్రామదేవతలు:
1. నుసకపల్లమ్మ
2. వెలగలమ్మ
3. ఊర్లమ్మతల్లి (గణపవరం ,కర్లపాలెం మండలం ,గుంటూరుజిల్లా )
4. పైళ్లమ్మతల్లి
5. బల్లమ్మతల్లి
6. లొల్లాలమ్మతల్లి
7. ఊడలమ్మ తల్లి
8. కట్వాలాంబిక
9. నాగాలమ్మ నాంచారమ్మతల్లి
10. సింగమ్మతల్లి
11. ఘట్టమ్మతల్లి
12. అంజారమ్మతల్లి .
13. మంత్రాలమ్మ తల్లి
14. పాతపాటేశ్వరి తల్లి
15. కుంకుళమ్మ ద్వారకా తిరుమల
16. చౌడమ్మ నందవరం కర్నూల్ జిల్లా
అలాగే ఖమ్మం, నల్గొండ జిల్లాలలో ముత్యాలమ్మ తల్లి ఆరాధన ఎక్కువగా కానవస్తుంది.
అమ్మలగన్న అమ్మలు ఆదిపరాశక్తిలు గ్రామదేవతలకు వందనాలు.
మన గ్రామదేవతలు ఎలా వెలిశారు.
మనం రకరకాల పేర్లతో పిలిచే గ్రామదేవతల నామ విశేషాలేమిటి?
గ్రామదేవతా వ్యవస్థ:
గ్రామాలలో వెలిసే దేవత దేవుళ్ళను ముఖ్యముగా స్త్రీ దేవతా రూపాలను గ్రామదేవతలని అంటారు.
సంప్రదాయాలను అనుసరించి గ్రామ రక్షణగా ఈ దేవతలను ఊరి పొలిమేరలలో ఏర్పాటు చేసేవారు.
ప్రాచీన కాలములో మానవుడు ఎంతో తెలివైనవాడు, ఇంట్లోవున్న చిన్నా, పెద్దా, ఆడా, మగా - అందరూ దేవీనవరాత్రుల కాలములో ఎక్కడోవున్న మధుర మీనాక్షమ్మ వద్దకో,కంచి కామాక్షమ్మ దగ్గరికో, బెజవాడ కనకదుర్గమ్మ చెంతకో వెళ్ళాలంటే కుదరకపోవచ్చు.
ఒక్కోక్కప్పుడు సొమ్మున్నా వెళ్ళే వీలుండక పోవచ్చు. వీలుచిక్కినా అందరికీ ఒకేసారి వెళ్ళడము సాద్యపడకపోవచ్చు. ఇలాంటి సందర్భాలలో అలాంటి వాళ్ళు అమ్మ దర్శనానికి వెళ్ళలేక పోయామే అని నిరాశ పొందకుండా వుండేందుకు ఎక్కడో వున్న తల్లిని ఇక్కడే దర్శించు కొన్నామనే తృప్తిని పొందేందుకు గ్రామదేవత వ్యవస్థని ఏర్పాటు చేసారు పెద్దలు.
ఈ దేవతా ప్రతిష్ఠ గొప్ప విద్వాంసులైన వేద, స్మార్త, ఆగమ శాస్త్ర పండితుల చేతనే జరుగుతుంది.
ఎవరికి నిజమైన భక్తి ప్రపత్తులతో పాటు అర్చకునిగా వుండే తీరిక, ఓపిక వుంటాయో అలాంటి వారిని వారి కోరిక మేరకు అర్చకులుగా నియమించారు పూర్వీకులు.
అప్పటినుంచి ఆ అర్చకుని వంశము వాళ్ళే ఆ గుడి బాధ్యతలను నిర్వహిస్తూ వస్తున్నారు.
దేవతా విగ్రహప్రతిష్ఠ శాస్త్రీయంగా నిర్వహించబడింది కాబట్టి, ఆ దేవతల కింద బీజాక్షరాలున్న యంత్రము సరైన మూహూర్తములోనే జ్ వేయబడింది కాబట్టి గ్రామదేవతలంతా శక్తివున్న దేవతలే అవుతారు.
భక్తుల కోర్కెలు తీర్చగలవారవుతారు.
అయితే ప్రతి సంవత్సరము ఆలయప్రతిష్ఠ జరిగిన
ఆ నెల, ఆ తిథినాడు ఖచ్చితముగా విద్వాంసులను పిలిచి పవిత్రోత్సవాన్ని చేయించాల్చిందే. అలా చేయడమువలన అమ్మకి మన ద్వారాఏదైనా లోటు పాట్లు కలిగివుంటే తొలగుతుంది.
గ్రామదేవతల ఆవిర్భావము:
పంచభూతాలు అనగా గాలి, నీరు, అగ్ని, భూమి, ఆకాశము కారణముగానే ఈ ప్రపంచము ఏర్పడినది.
అందుకని ఈ పంచ భూతాలకి ప్రతీకలుగా ఐదుగురు గ్రామదేవతలను ఏర్పాటు చేసారు.
పృధ్వీ దేవత:
మొదటిది పృధ్వీ అంటే నేల,ఇది పంటకి ఆధారము,
కుంకుల్లు బాగా పండే ప్రాంతములో ప్రతిష్టించిన
పృధ్వినీ దేవతను కుంకుళ్ళమ్మ అన్నారు.
గోగులు బాగా పూచే ప్రాంతములో ఆ గోంగూర, గోగునార ఇవే వారి జీవన ఆధారము
కాబట్టి ఆపేరుతో గోగులమ్మని యేర్పాటు చేసారు.
జొన్నలు పండేచోట జొన్నాళమ్మ అని, నూకలు అంటే వరి పండే ప్రాంతాలలో నూకాళమ్మ అని పిలుచుకున్నారు.
మొదటిసారిగా పండిన పంటను ఆతల్లికే నివేదన చేయడము, అర్చకునిగా వున్నవానికి అందరూ ఆ పంటను యిస్తూ వుండడము, దాన్నే సొమ్ముగా
మార్చుకొని అతడు జీవించడము. ఇలా సాగుతూ వుండేదీ వ్యవస్థ.
పంట వేసేటప్పుడుకూడా ఈ తల్లిని ఆరాదిస్తేగాని
చేనుకి వెల్తూండేవారు కాదు. అన్నాన్ని పెట్టే తల్లి
కాబట్టి అన్నమ్మ అని కూడా ఒక దేవత వుంది.
ఇక పంటలన్నీ చేతికందాక సుఖసంతోషాలతో
జాతర చేస్తూండేవారు. అదే ఇప్పటికీ అనేక గ్రామాలలో కొనసాగూతూండడం జరుగుతూ ఉన్నది.
జల దేవత:
రెండవది జలానికి సంబంధించిన తల్లి గంగమ్మ–గంగానమ్మ. ఈ తల్లి భూమి మీద కాక భూమిలోపల ఎంతో లోతుగా వుంటుంది.గుడి ఎత్తుగా కట్టినా
తల్లిని చూడాలంటే మెట్లుదిగి కిందికి వెళ్ళ వలసి ఉంటుంది.
అగ్ని దేవత:
మూడవది తేజస్సు(అగ్ని). పగటిపూట తేజస్సునిచ్చే సూర్యునికి ప్రతీకగా సూరమ్మనూ,రాత్రిపూట తేజస్సు నిచ్చే చంద్రునికి ప్రతీకగా పున్నమ్మ నీ దేవతలుగా చేసారు. ( చిత్తూరు పున్నమ్మ గుడిలో హారతి సమయంలో పంబల్లు వాయిస్తారు అది ఉంటూ హారతి చూస్తే అమ్మవారు ఆనందంతో వెలిగిపోతున్నట్టు కనిపిస్తోంది, ఎప్పుడూ అదే కొనసాగుతోందా తెలియదు).
సూరమ్మను ప్రతి అమావాస్యనాడు, పున్నమ్మను ప్రతి పౌర్ణమినాడు పూజించే విధముగా ఏర్పాటు చేసుకొని తమ కులవృత్తిని ఆరోజు మానేయడం చేసేవారు.
ఇక అమ్మకి కుడి కన్ను సూర్యుడుగానూ ఎడమ కన్ను చంద్రుడిగాను ఆతల్లికి పెట్టిన పేరు ఇరుకళలమ్మ (సూర్య,చంద్రుల కళ వున్న అమ్మ).
వాయు దేవత:
నాలుగవది వాయువు కరువలి అంటే పెద్ద గాలి.
కొండ ప్రాంతములో వుండేవారికి విపరీతమైన కొండగాలి వీచినప్పుడు ఏ ఉపద్రవము ఉండకుండా రక్షించేందుకు కరువలమ్మను యేర్పాటు చేసుకున్నారు.
ఆకాశ దేవత:
ఐదవది ఆకాశము ఎత్తులో వున్నందున కొండమ్మ ను
ఆకాశ దైవానికి ప్రతీకగా తీసుకున్నారు. పిడుగులు, మెరుపులు,గాలివాన. ఇలాంటి వాటి నుండి
రక్షించేందుకు ఈ తల్లిని యేర్పాటు చేసుకున్నారు.
గ్రామదేవతా నామ విశేషాలు:
మనం రకరకాల పేర్లతో పిలిచే ప్రతి గ్రామదేవత పేరు వెనుక ఒక పరమార్ధం ఉంది.
సొంతవూరిని విడిచి పొరుగూరు వెళ్ళే వ్యక్తుల రాకపోకల్ని గమనిస్తూ వూరి పొలిమేరలో వుండేతల్లి పొలిమేరమ్మ క్రమముగా పోలేరమ్మ అయింది.
ఎల్ల' అంటే సరిహద్దు అని అర్దము అందుకే 'ఎల్లమ్మ' కూడా ఈ పనిని చేసేదన్నమాట.
ఒక వ్యక్తికి జీవన భృతి కలిగించి పోసించే తల్లి
'పోచ+అమ్మ=పోచమ్మ' అన్నమాట.
ఎల్లమ్మ తల్లి తన భక్తులకి ఎటువంటి వ్యాధులు రాకుండా నివారించేదైతే, పోచమ్మ పోషణ కలిగిస్తుంది.
ప్రతి వ్యక్తికీ ఇంతకాలము జీవించాలనే ఓ కట్ట (అవధి) ఏదుందో ఆ కట్టని మేయగల
(ఆ అవధినించి రక్షించగల) అమ్మే 'కట్టమేసే+అమ్మ=
కట్టమేసెయమ్మ కాలక్రమములో కట్టమైసమ్మ అయింది.
స్వచ్ఛమైన అమ్మ అనే అర్దములో (స్వచ్ఛమని)సు+అచ్చ= స్వచ్ఛ అనే రెండు పదాలు కలిపి అచ్చమ్మగా అయ్యింది.
సాధారణముగా 15 వూళ్ళకో దేవత వుంటుంది.
'మా వూళ్ళన్నింటికీ అమ్మ' అనే అర్దములో ఆమెను మావూళ్ళమ్మ అని పిలుస్తూంటే క్రమముగా అది మావుళ్ళమ్మ' అయింది.
ప్రజల మనసులో పుట్టే ఏ కోర్కెనైనా మంచిదో కాదో తానే నిర్ణయించి కోరిన కోర్కెని తీర్చే బాధ్యతని స్వీకరించి భక్తులకు అండగా నిలిచే తల్లి తలుపులమ్మ. తలపు అంటే ఆలోచన. వాటిని తీర్చే తల్లి తలపులమ్మ క్రమముగా 'తలుపులమ్మ'గా మారింది.ఇంట్లో నుండి బయటికి వెళ్ళేటపుడు తల్లికి
లేదా భార్యకి ఎలా చెప్తామో అలాగే ఆ తల్లిని ప్రార్థించి వెళ్ళడం చేస్తారు.
శంకరునితో కలసి అర్దనారీశ్వర రూపముతో అమ్మవారుండేది. ఆకారణముగా శంకరుని మెడమీద (గళము) మచ్చ (అంకం) కారణముగా అంకగళమ్మ, అంకాళమ్మ గా మారిపోయింది.
పొలిమేరలో వుండే మరొక తల్లి శీతలాంబ.
ఈమె చేతుల్లో చీపురు, చేట ఉంటాయి.
తన గ్రామములోని ప్రజలకు వ్యాధులను కలిగించే క్రిమి కీటకాలని, భయాన్ని కలిగించే భూత ప్రేత పిశాచ గణాలను గ్రామములోనికి రాకుండా వూడ్చి చేటలోకి ఎత్తి పారబోసేది ఈ దేవతే.
పాములు బాగా సంచరించే చోటులో వుండే దేవత తల్లి పుట్టమ్మ ఈమె గుడిలో అనేక పుట్టలుంటాయి.
అక్కడే సుబ్రహ్మణ్య షష్టికి అందరూ పుట్టలో పాలు పోస్తారు. ఈ తల్లికే 'నాగేశ్వరమ్మ' అని కూడా అంటారు. పాము+అమ్మ=పాపమ్మ అవుతుంది కాబట్టి ఈ తల్లికి పాపమ్మ అని కూడా అంటారు.
సుబ్రహ్మణ్యేశ్వరుడు పేరుమీదే 'సుబ్బ+అమ్మ=సుబ్బమ్మ కూడా దైవముగా ఉంది. బతుకుకి కావలసిన వర్షాన్ని పంటనీ ఇచ్చే తల్లి బతుకమ్మ.
గ్రామప్రజల మంచిని చూసే (కనే) అమ్మ కన్నమ్మగా ఎప్పుడూ సత్యాన్ని (నిదర్శనాలని) చూస్తూవుండే తల్లి సత్య+అమ్మ= సత్తెమ్మ.
అలాగే పుల్ల (వికసించిన కళ్ళున్న) అమ్మ పుల్లమ్మ.
ప్రతి విషయాన్ని ఎంతో శ్రద్ధగా పరిశీలించి చూస్తుంది
కాబట్టి ఆమె పుల్లమ్మ అయ్యింది.
ఇక ప్రతి శుభకార్యానికి నైవేద్యాన్ని అర్పించుకొనే
చోటవున్న తల్లి అర్పణ+అమ్మ =అర్పణలమ్మ క్రమముగా అప్పలమ్మ అయినది.
బెల్లము బాగా వున్న ప్రాంతాలలో ఈ తల్లికి అప్పాలు బాగా ఇష్టమంటూ భావించే భక్తులు అప్పాల+అమ్మ=అప్పలమ్మ అన్నారు.
అమ్మవార్ల వూరేగింపులో అన్నిటికన్న చిన్నది బాలా త్రిపుర సుందరి విగ్రహానికి సమమైన వుజ్జీ అయినది పెంటి (బాల)+అమ్మ=పెంటమ్మ.
భోజనాన్ని అందించగల తల్లి అనే అర్దములో బోనముల (భోజనమనే పదానికి వికృతి)+అమ్మ=బోనాలమ్మ.
అయ్య అయిన శంకరునికి అమ్మ (భార్య) కాబట్టి ఈమెను 'అయ్యమ్మ' అని కూడా కొన్ని చోట్ల పిలుస్తారు.
లలితాంబ, భండాసురుణ్ణి చంపేందుకు గుర్రాలమీద కూర్చొన్న స్త్రీ సైనికుల సైన్యముతో వెళ్ళినది
కాబట్టి గుర్రాల+అమ్మ=గుర్రాలమ్మ అయినది.
ఊరు పేరుని బట్టి పీల్చుకొనే దేవతలు కొందరున్నారు. సోమప్రోల+అంబ='సోమపోలమాంబ' అన్నారు. సోమప్రోలు అనే గ్రామము ఉత్తరాంధ్ర శ్రీకాకుళం జిల్లాలోని సోంపేట.
పేర్లు ఏవైతేనేమి, ఆ తల్లి ఎప్పుడూ మనకు తోడుగా, అండగా నిలిచి మనందరినీ కంటికి రెప్పలా కాపాడుతుంది.
ఓం గం గణపతయే నమః
శ్రీ మాత్రే నమః
Names of village goddesses
Parvathi is a strong belief that she will become the goddess of the villages and protect the villages from diseases.
This mother has 101 sisters and they call only one brother Poturaju. A few of them.
Names of 101 sisters of village goddesses:
1. Pagelamma
2. Mother of pearl
3. Gangamma
4. Mother Ganga
5. Golden mother
6. Gonthemma
7. Mother in law
8. The lock
9. Chinthalamma
10. Chittharamma
11. Poleramma
12. Our mother
13. Maremma
14. Golden mother
15. Puttanamma
16. Goddess Dakshayana
17. Great grand mother
18. Ravulamma
19. Gandipochamma
20. Megadharamma
21. Eerinama
22. Goddess Durga
23. Modugulamma
24. Nookalamma (Anakapalli, Visakha district)
25. Maridamma
26. Nerellamma
27. Musalamma in Punta (Meyyeru, Near Attili, West Godavari District)
28. Macharammoru
29. Maddi Anapa Ammoru
30. Somali mother
31. The mother of the big house
32. Gurralakka (Antarvedi, East Godavari District Gurralamma)
33. Ambikalamma
34. Money mother
35. Malakshamma
36. Itakalamma
37. Mother of donation
38. Ratnalamma
39. Mother of the door
40. Penneramma
41. Venkayamma
42. Gunalamma
43. Ellamma (Visakhapatnam)
44. Elder mother
45. Mantalamma
46. Guntalamma
47. Sunkulamma
48. Jambulamma
49. Perantalamma
50. Kantikalamma
51. Vanuvulamma
52. Subbalamma
53. Elder sister
54. Ganigamma
55. Goddess Dharaamma
56. Mahalakshma
57. Lankalamma
58. Dosaalamma
59. Pallalamma (Vanapalli, East Godavari District)
60. Ankalamma
61. Jogulamma
62. Paidithallamma
63. Chengalamma
64. Ravulamma
65. Burugulamma
66. Kanakamahalakshmi (Visakhapatnam)
67. Polamma
68. Kondalamma
69. Vernimma
70. Hey Simma
71. Garavalamma
72. Garagalamma
73. Mother of God
74. Mahankalamma
75. Peanut mother
76. Maridamma
77. Thorny mango
78. Yalaaramma
79. Valluramma
80. Nagulamma
81. Vegulamma
82. Mudialamma
83. Renukamma
84. Nangalamma
85. Chagalamma
86. Nancharamma
87. Sammakka
88. Saralamma
89. Buttermilk Gauramma
90. Kannamma - Perantaalamma
91. Rangamma - Perantaalamma
92. Vengamma - Perantaalamma
93. Tirupathamma
94. Reddamma
95. Pagadalamma
96. Murugulamma (Bandarulanka, East Godavari District)
97. Kunchama in Visakhapatnam
98. Erakamma
99. Village mother
100. Maridamma
101. Sunkalammavva is there.
Village goddesses of Nusakapalli, Pamarramandal, East Dodavari district.
1. Nusakapallamma
2. Velagamma
3. Urlam mother (Ganapavaram, Karlapalem Mandal, Guntur District)
4. PillammaThalli
5. Ballamma mother
6. Lollalamma mother
7. Udalamma mother goddess
8. Katwalambika
9. Nagalamma is my mother
10. Lioness mother
11. Mother of Ghattamma
12. Anjara mother goddess.
13. Mantralamma mother goddess
14. Mother of old Pathapateshwari
15. Thirumala at Kumkulamma Dwarka
16. Chowdamma Nandavaram Kurnool District
Likewise in Khammam, Nalgonda districts, the worship of Muthyalamma goddess is seen more.
mothers who are like mothers, Adipara Shakti, salutes to the village goddesses,
How did our village goddesses appear
What are the names and features of the village goddesses that we call by different names?
Village Goddess System:
Goddess who appears in villages... Gods, especially female goddess forms are called village goddesses.
Following traditions, these deities were arranged in the village polimera for the protection of village.
Man was very wise in ancient times,
If you want to go to Madhura Meenakshamma, Kanchi Kamakshamma, Bejawada Kanakadurgamma, Bejavada Kanaka Durga
Might not be possible.
Sometimes you may not be able to go even if you have money. Let's go all at once
Might not be possible. In such situations as this
To avoid getting disappointed that such people could not go to Amma Darshan
We have visited the mother who is somewhere else here.
Elders have arranged a village deity system to get satisfaction.
This divine prestige is the great scholars of Veda, Smartha,
Arrival is done by the scholars only.
Along with true devotion to whom
The way to be a priest, will he have patience
Such people as priests as per their wish
The appointed by the ancestors.
Since then, that priest's dynasty has been handling the responsibilities of that temple.
Goddess idol done scientifically
So, the machine with seed letters under those goddesses
Just because j was put at the right moment
All village gods will become powerful goddesses-
Bhakts of devotees will be fulfilled.
But every year temple pratishta happened
That month, that tithe day was definitely to call the scholars and conduct the sanctification. By doing so, any deficiencies will be removed by us to the mother.
The origin of village goddesses:
This world was formed due to Panchabhutalu i.e. air, water, fire, earth, sky.
That's why five people as symbols for these five ghosts
The village goddesses have been arranged
In the early stages.
Goddess of the Earth:
First is earth means ground, this is the basis for crop,
Established in the area where kunkullu is well ripened
Prithwini goddess is called as Kunkullamma.
In the area where gogulu blooms well, that Gongura and Gogunara are their life support
So Gogulamma was arranged with the opera.
Jonnalamma where maize is grown, Nookalu means Nookalamma where paddy is grown.
We report the crop that was harvested for the first time to the mother, we should all give the crop to the priest, that is the money
He shall live by changing. This is how the system goes on.
If you worship this mother even during cultivation
Would not have been going to the creek. The mother who feeds the food
So there is a goddess called Anamma.
Now all the crops are on hand with happiness
The ones who used to do the fair. The same is still going on in many villages.
Goddess of Water
Second one is the mother of water Gangamma- Gangaanamma. This mother is not on earth but deep inside the earth. Even if the temple is built high
If you want to see your mother, you have to go down the stairs.
Goddess of Fire
The third one is the brilliance (fire). Suramma as the symbol of the sun which gives brightness during the day and Punnamma as the symbol for the moon which gives brightness during night. (In Chittoor Poonnamma temple, Pamballu will be played during harathi, when you see harathi, it seems that Ammavaru is shining with happiness, don't know whether it is going on all the time).
They used to stop their caste profession by arranging Suramma to be worshipped on every new moon day and Punnamma to be worshiped on that day.
Now mother's right eye is Sun and left eye is Moon. Mother's name is Irukalamma (mother who has the art of Sun and Moon).
Goddess of the Air:
The fourth gas drought means big wind.
Karuvalamma has been arranged to protect those in the hilly region from any disturbance when the extreme mountain wind blows.
Goddess of the sky:
Since the fifth sky is high, Kondamma
Taken as a symbol of the sky god. Thunder, lightening, and a storm. From these kind of things
This mother was put to the rescue.
Village Goddess Name Features:
Every village goddess whom we call by different names
There is a meaning behind the name
People who leave their native place and go to their neighbor place
In the village polimera observing the arrivals
Vundethalli Polimeramma gradually became Poleramma.
Ella' means border. That is why 'Ellamma' also did this work.
Mother who feeds a person by providing a living allowance
'Pocha+Amma=Pochamma' it seems.
What kind of diseases Ellamma Talli has for her devotees
Pochamma nourishes, if it prevents from occurring.
Every person has to live this long
Don't know what is a bundle (period) you can graze that bundle
(The one who can save from that period) is the mother who builds + mother =
In Kattameseyamma timeline, it became Kattamaisamma.
In the meaning of pure mother (Swachhamani) Su+Acha=Swachha (Swachhamma) has been combined and it has become Achakamma.
Normally, there is a goddess for every 15 villages.
In the meaning of 'Mother to all our wools'
Calling her my mother in law
Step by step it became my grandmother.
Thalupulamma is the one who decides whether it is good or not and stands by the devotees by herself. The head is the thought. Talapulamma, the mother who fulfills them gradually became 'Thalupulamma'. to mother when going out of the house
Or how they tell the wife they pray for the mother and leave.
With Shankar in the form of Ardanareeswara
The one where the goddess is. Due to the scar on Shankar's neck (neck)
Ankagalamma has changed to ankalamma.
Sheetalamba is another mother in polymera.
Her hands will have a broom and a broom.
Ghost idol who frightens the insects that cause diseases to the people of his village
To prevent the evil masses from entering the village
This goddess is the one who is going to lift the wood into the tree and throw it away.
The mother goddess who is in the place where snakes travel a lot. There are many births in her temple.
Everyone is in Putta for Subrahmanya Shashti
Milk will be poured. Nageswaramma is for this mother
Also known as that. Snake+Mother=Paapamma, so this mother is also called as Paapamma.
Subba+Amma= in the name of Subrahmanyeshwara
Subbamma is also divine. Bathukamma is the mother who gives the rain that is needed for life.
The one who sees the good of the villagers (Kane) as mother Kannamma
Satya + Amma = Satyamma who always sees the truth (examples).
Also Pulla (with blossomed eyes) Amma Pullamma.
Looks at everything with great attention
So she became a sour patch.
Now offering for every good deed
Mother Arpana + Mother = Arpanalamma respectively became Appalamma.
Appalu to this mother in the areas where jaggery is rich
Devotees who we like the most said Appala+Amma=Appalamma.
The youngest of all the mommavarcassion
Vujji equivalent to Bala Tripura Sundari's statue
What happened is wife (child)+mother=wife.
In the sense of a mother who can provide food
Bonamula (distortion to the word food) + Mother =
Bonalamma.
Shankar who is father is mother (wife)
In some places she is called 'Ayyamma'
Will be called.
Lalitamba, a woman sitting on horses went with an army of soldiers to kill Bhandasuru
So horse + mom = horse mom.
There are some goddesses who suck according to the name of the town. Somaprola+Amba='Somapolamamba'
Said. Somaprolu is a village called Sompet in Srikakulam district of North Andhra..!!
whatever the names are,
That mother is always the same
As a companion to us,
Stand by and support
All of us have to do this.
Like an eyelash to the eye
Protects.
Sri Mother Namaha
Sarvojana Sukhinobhavant
0 Comments