Ad Code

ప్రతి స్త్రీ అమ్మవారి రూపమే - Every Women is A Goddess

ప్రతి స్త్రీ అమ్మవారి రూపమే


నవరాత్రి సమయంలో నే కాదు ఎప్పుడు ఎవరికి తాంబూలం ఇచ్చిన ఆ ఆడవాళ్లకు అమ్మవారి స్వరూపంగా భావించే ఇవ్వాలి. భావించడం ఎందుకు అమ్మవారే అనుకోవాలి. ప్రతి స్త్రీ లోనూ ఆ తల్లి అంశ ఉంటుంది. చిన్న పిల్లలు బాల స్వరూపం. ముత్తైదువులు త్రి మాత స్వరూపం, బిడ్డలు కనని తల్లి పార్వతి స్వరూపం ఆమె గర్భం దాల్చలేదు అందువల్ల పిల్లలు లేని వారు బాధ పడకూడదు అందరూ తమ పిల్లలే అనుకోవాలి, భర్త లేని పూర్వ సువాసినిలు ధూమ్రవతి స్వరూపం. వారు కూడా లలితా నామ పారాయణం అమ్మవారికి పూజ చేయవచ్చు. ఆడవాళ్లు భక్తిగా పూజ చేస్తే చాలు కొన్ని సంవత్సరాలు తపస్సు చేసిన ఫలితం వారికి అమ్మవారు అనుగ్రహిస్తుంది. ఆడవాళ్లు ఎక్కువగా మౌన వ్రతం పాటిస్తే త్వరగా అనుగ్రహిస్తుంది. పూర్వ సువాసినిలు తాంబూలం ఇవ్వకూడదు తీసుకోకూడదు కానీ నిక్షేపంగా పూజ చేసుకోవచ్చు. ప్రసాదం తీసుకోవచ్చు ఇవ్వచ్చు.

మీ యొక్క స్థితి గతులను లోటు పాట్లు అన్ని ఆమెకు తెలిసినదే కదా ఎవరో చేసినట్టు చేయాలి అని అప్పుచేసి ఆడంబరంగా చేయకండి. ఉన్నంతలోనే తృప్తిగా పూజ నామ జపం చేసుకోండి. తాంబూలం తో పాటు కుదిరితే రవిక ముక్క స్తోమత ఉంటే చీర పెట్టండి లేకుంటే తాంబూలం పసుపుకుంకుమా ప్రసాదం పంచుకున్నా చాలు. గాజులు పంచుకోండి ,మగవాళ్ళు నవరాత్రి వ్రతం చేసే వాళ్ళు వారి ఇంట్లో అడవాళ్ళతో తాంబూలం ఇప్పించండి. మగవాళ్ళు పరాయి ఆడవాళ్ల చేతికి పసుపుకుంకుమ ఇవ్వకూడదు , కానీ భార్యకు వాళ్ళ చేత్తో తాంబూలం పసుపుకుంకుమా గాజులు ఇస్తే మంచిది అలాగే ఇంట్లో అమ్మవారి కి తాంబూలం సమర్పిస్తాము కదా (ఆకు వక్క, పసుపుకుంకుమా, రవిక గాజులు, చీర) ఇలాంటివి తల్లికి సమర్పించినవి భర్త చేత్తో మీరు స్వీకరించాలి అక్షంతలు వేయించు కుని ఆశీర్వాదం తీసుకోవాలి అది వారికి మంచిది తీసుకున్న భార్యకు మంచిది.

సర్వేజనాః సుఖినోభవంతు
శుభమస్తు
గోమాతను పూజించండి, గోమాతను సంరక్షించండి.






Post a Comment

0 Comments