బెండకాయలు తింటే ఉపయోగాలు ఏమిటో తెలుసా?
బెండకాయ తింటే తెలివితేటలు పెరుగుతాయని పెద్దలు అంటుంటారు. అయితే ఆ సంగతి ఎలా ఉన్నా బెండకాయ విటమిన్లు, ఖనిజాలు, పీచు మాత్రం పుష్కలంగా దొరుకుతాయని పోషక నిపుణులు పేర్కొంటున్నారు. బెండకాయలను ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల వీటిల్లో దొరికే లెక్టిన్ అనే ప్రొటీన్ రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. బెండలోని ఫోలేట్లు అనేక రకాల క్యాన్సర్లను అడ్డుకుంటాయి. ఫోలేట్ లోపం వల్ల రొమ్ము, మెడ, క్లోమ, ఊపిరితిత్తుల క్యాన్సర్లు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని నిపుణులు చెబుతున్నారు.
ముఖ్యంగా గర్భణీగా ఉన్నప్పుడు ఇవి మరీ అవసరం. బెండకాయ గింజల్ని ఎండబెట్టి చేసిన పొడి మధుమేహానికి మందుగా పనిచేస్తుంది. అనేక వ్యాధుల నివారణకు పండ్లూ, కూరగాయల్లోని పీచు ఎంతో అవసరం. బెండలో పీచు పుష్కలంగా దొరుకుతుంది. ఈ కాయల్లోని యాంటీ ఆక్సిడెంట్లు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ పేర్కొంటుంది.
బెండకాయ గింజల్లోని పదార్ధాలు అద్భుత యాంటీ ఆక్సిడెంట్లలా పనిచేస్తూ ఒత్తిడిని తగ్గిస్తాయి. విటమిన్ కె ఎక్కువగా ఉండే బెండకాయలు ఎముకలకూ ఎంతో మంచిది. కాల్షియంను శోషించుకునేందుకు వీటిల్లోని ఇ విటమిన్ దోహదపడుతుంది. అయితే మొలలూ, మూత్రపిండ వ్యాధులు, కీళ్ళ నొప్పులూ ఉన్నవాళ్ళు వీటిల్లోని ఫ్రక్టేన్లూ, ఆక్సలేట్లూ, సొలమిన్ల కారణంగా తగు మోతాదులో తీసుకోవడం మంచిది.
బెండకాయ ఆరోగ్యకర ఉపయోగాలు:
బెండకాయలోని మ్యూకస్ వంటి పదార్ధము కడుపులో మంటనుంచి ఉపశమనాన్ని ఇస్తుంది. పీచు, విటమిన్ ' సి ' దీనిలో చాలా ఎక్కువ . మ్యూకస్ పదార్ధము గాస్ట్రిక్ సమస్యలను, ఎసిడిటీకి చక్కని పరిష్కారము . దీనిలోగల డయూరిటిక్ లక్షణాలవల్ల యూరినరీ ట్రాక్ట్ ఇంఫెక్షన్‌ను నయము చేయడములో సహకరిస్తుంది. బెండకాయ డికాక్షన్ తాగితే జ్వరము తగ్గుతుంది. చిన్న చిన్న ముక్కలుగా కోసి నీటిలో మరిగించి చల్లారేక తాగితే టెంపరేచర్ తగ్గును . చెక్కెర (డయాబిటీస్ ) నియంత్రణలోనూ సుగుణం చూపుతుంది. బెండకాయ నిలువుగా చీల్చి రెండు సగాల్ని గ్లాసు నీటిలో రాత్రంతా ఉంచి, మరునాటి ఉదయము ముక్కలు తీసివేసి ఆ నీటిని త్రాగాలి. ఇలా రెండు వారాలు పాటు త్రాగితే సుగర్ స్థాయిలు తగ్గుతాయి. దీనిలో ఉండే పెక్టిన్ బ్లడ్ కొలెస్టిరాల్ ను తగ్గించును. బెండకాయ విటమిన్ సి కలిగి ఉంటుంది. ఇది ఆస్తమా వంటి శ్వాసకోశ సమస్యలు తగ్గించడంలో సహాయపడుతుంది.
బెండకాయ రసం వలన కలిగే ప్రయోజనాలు:
బెండకాయ మన ఇళ్ళలో సాధారణంగా వండే కూరగాయ రకం మరియు పోషక విలువలను కలిగి ఉండే బెండకాయ ఆరోగ్య ప్రయోజనాలను చేకూరుస్తుంది. బెండకాయను వివిధ రకాలుగా, కూరలుగా తయారు చేసుకుంటాము. మీరేపుడైన బెండకాయ రసాన్ని తాగారా? అవును, వినటానికి ఏదోలా ఉన్న, వండిన రూపంలో కన్నా జ్యూస్ రూపంలో అనేక పోషకాలను కలిగి ఉంటుంది. మనలో చాలా మందికి బెండకాయ రసం వలన కలిగే ప్రయోజనాల గురించి దాదాపు తెలియదు. వీటిలో ఉండే పోషక విలువలు మరియు ఆరోగ్యకర ప్రయోజనాల గురించి ఇక్కడ తెలుపబడింది.
అనీమియాను తగ్గిస్తుంది:
అనీమియా అనగా ఏమిటి? శరీర రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలు తగ్గటాన్ని అనీమియా పేర్కొంటారు. దీని వలన పాలిపోవటం మరియు అలసట వంటివి కలుగుతాయి. కానీ, బెండకాయ రసం తాగటం వలన రక్తంలో ఎర్రరక్తకణాల సంఖ్య అధికం అవటం ద్వారా అనీమియా తగ్గించబడుతుంది. బెండకాయ రసంలో విటమిన్ 'C', మెగ్నీషియం, విటమిన్ 'A' కలిగి ఉండి మరియు శరీర రక్తంలో ఎర్ర రక్తకణాల ఉత్పత్తిని పెంచుతుంది.
గాయంగా ఉండే గొంతు & దగ్గు నుండ ఉపశమనం:
మీరు తీవ్రమైన దగ్గు మరియు గొంతు గాయం వలన సమస్యలు ఎదుర్కొంటున్నారా? అయితే యాంటీ బాక్టీరియల్ మరియు యాంటీ సెప్టిక్ గుణాలను కలిగి ఉండే బెండకాయ రసాన్ని తాగండి. అవును బెండకాయ రసం వలన కలిగే ప్రయోజనాలలో ఇది కూడా ఒకటి. ఇది కలిగి ఉండే యాంటీ బాక్టీరియల్ మరియు యాంటీ సెప్టిక్ గుణాలు అదనపు ప్రయోజనాలుగా చెప్పవచ్చు.
మధుహులకు ఊరట:
బెండకాయ రసంలో ఇన్సులిన్ గుణాలను కలిగి ఉండే సమ్మేళనాలను కలిగి ఉండే ఉండటం వలన మధుమేహ వ్యాధి స్థాయిలను తగ్గించబడతాయి. బెండకాయ రసంను రోజు తాగటం వలన శరీర రక్తంలోని చక్కెర స్థాయిలు తగ్గటం వలన మధుమేహ వ్యాధి నియంత్రణలో ఉంచబడుతుంది.
విరేచనాల నుండి ఉపశమనం:
శరీరం నుండి ద్రావణ రూపంలో మలం వెళ్ళటం ద్వారా కలిగే ఇబ్బందులు చాలా భాదాకరంగా ఉంటాయి. వీటినే విరేచానాలు అంటారు. ఈ విధంగా నీటిని కోల్పోవటం వలన శరీర డీ-హైడ్రేషన్ కు గురవుతుంది. ఇలాంటి పరిస్థితులలో బెండకాయ రసం చాలా ప్రయోజనకరం కానీ, చాలా మందికి విరేచానాలను తగ్గిస్తుందని తెలియదు.
బెండకాయ నీటిని ఉదయాన్నే పరగడుపున తాగితే?
బెండకాయను మనం తరచూ కూర చేసుకుని తింటూనే ఉంటాం. దీంతో ఫ్రై, పులుసు వంటివి చేసుకోవచ్చు. అవి చాలా రుచికరంగా ఉంటాయి. అయితే కేవలం రుచికే కాదు, బెండకాయతో మనకు అనేక ఆరోగ్యకర ప్రయోజనాలు కూడా కలుగుతాయి. పలు అనారోగ్య సమస్యలను కూడా దూరం చేసుకోవచ్చు. అయితే అందుకు బెండకాయ నీటిని రోజూ ఉదయాన్నే పరగడుపున తాగాల్సి ఉంటుంది. మరి ఆ నీటిని ఎలా తయారు చేయాలో, దాంతో ఏమేం అనారోగ్యాలు నయం అవుతాయో ఇప్పుడు తెలుసుకుందామా! రెండు బెండకాయలను తీసుకుని బాగా కడగాలి. వాటిని మొదలు, చివర భాగాలను కట్ చేయాలి. అనంతరం ఒక్కో బెండ కాయను నిలువుగా చీరాలి. కానీ పూర్తిగా చీరకూడదు. చివరి భాగం వరకు మాత్రమే చీరి వదిలేయాలి. అలా రెండు బెండకాయలను కట్ చేశాక ఒక గ్లాస్ నీటిని తీసుకుని అందులో వాటిని వేయాలి. ఆపై మూత పెట్టాలి. రాత్రంతా ఆ నీటిని అలాగే ఉంచాక, ఉదయాన్నే ఆ గ్లాస్‌లోంచి బెండకాయలను తీసేసి ఆ నీటిని పరగడుపునే తాగేయాలి. ఇలా చేయడం వల్ల ఏమేం లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 1. పైన చెప్పిన విధంగా బెండకాయ నీటిని తాగితే పేగులు, జీర్ణాశయం శుభ్రమవుతాయి. అల్సర్లు ఉంటే తగ్గుతాయి. గ్యాస్, అసిడిటీ, మలబద్దకం నయమవుతాయి. 2. ఫైబర్, విటమిన్ ఇ, సి, కె, మెగ్నిషయం, పాస్ఫరస్ వంటి పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. దీంతో చక్కని పోషణ అందుతుంది. 3. రక్తం సరఫరా మెరుగు పడుతుంది. గుండె ఆరోగ్యం బాగుంటుంది. బీపీ తగ్గుతుంది. 4. మధుమేహం నయమవుతుంది. రక్తంలోని షుగర్ స్థాయిలు కంట్రోల్ అవుతాయి. 5. ఎముకలు దృఢంగా మారుతాయి. స్త్రీలకు రుతు సమయంలో వచ్చే సమస్యలు తగ్గుతాయి. 6. వేడి శరీరం ఉన్న వారు తాగితే శరీరం చల్లబడుతుంది. 7. ఒంట్లో అధికంగా ఉన్న కొవ్వు కరిగిపోయి అధిక బరువు ఇట్టే తగ్గుతారు. 8. చర్మం కాంతివంతంగా మారుతుంది. జుట్టు దృఢంగా, ఒత్తుగా పెరుగుతుంది. 9. శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. నేత్ర సమస్యలు పోయి దృష్టి బాగా పెరుగుతుంది.
ఆరోగ్యానికి అండ, మన బెండ? బెండకాయ వలన ఉపయోగాలు:
అమ్మాయి చేతి వేళ్ళలా నాజూ గా ఉండే కూరగాయ బెండకాయ.బెండకాయ ను ఇష్టపడనివారుండరు .విందు ఏదైనా బెండకాయ వంటకం ఉండాల్సిందే. ఆకట్టుకొనే రంగు,కమ్మని రుచి దీని ప్రత్యేకతలు. బెండలోని యాంటీ ఆక్సీడెంట్లు, పీచు, ఇతర పోషకాలు, ఆరోగ్య పరిరక్షణలో ఎంతగానో ఉపయోగపడతాయి. బెండలోని ఐరన్, పొటాషియం, సోడియం వంటి ఎలక్ట్రోలైట్లు, బీటాకెరోటిన్, బి-కాంప్లెక్స్, విటమిన్-సి శరీరంలోని ద్రవాలను సమతుల్యంగా ఉంచేలా చేసి నాడీవ్యవస్థను చురుగ్గా పనిచేయిస్తాయి. అందుకే దీన్ని బ్రెయిన్ ఫుడ్ అని అంటారు.
ఉపయోగాలు:
1.మలబధ్ధకం, గ్యాస్ వంటి సమస్యలను దూరం చేస్తుంది.
2. బరువు తగ్గేందుకు సాయపడుతుంది.
3.రక్తంలోని హానికారక కొలెస్టాల్ ను తగ్గించి హృదయ సంబంధిత వ్యాధులను రాకుండా చేస్తుంది.
4.ఎసిడిటీ,గ్యాస్, అల్సర్ల బాధితులు పచ్చి బెండ తింటే ఆ జిగురు జీర్ణకోశానికి లోపల పొరగా ఏర్పడి ఉపశమనం కలుగుతుంది.
5. మూత్ర సంబంధిత, మూత్రాశయ నాళపు ఇన్ఫెక్షన్లు దూరమవుతాయి. మూత్రం సాఫీగా వస్తుంది.
6.జ్వరం బాధితులు బెండ ముక్కలు వేసి కాచిన నీటిని చల్లబరిచి తాగితే జ్వరం తగ్గుతుంది.
7.మధుమేహులు గ్లాసు నీటిలో బెండకాయ ముక్కలు వేసి రాత్రంతా ఉంచి లేవగానే ముక్కలు తీసి ఆ నీటిని తాగాలి. ఇలాచేస్తే 2 వారాల్లో రక్తంలోని చక్కెర స్థాయిలు అదుపులోకి వస్తాయి.
8.తరచూ బెండకాయ తినేవారిలో మెదడు పనితీరు బాగుంటుంది. మానసిక సమస్యలు దరిజేరవు.
9.బెండకాయలోని ఫోలిక్ ఆమ్లం అటు గర్భిణులకు, శిశువు నాడీవ్యవస్ధ వృధ్ధికి ఇతోధికంగా మేలు చేస్తుంది.
10.బెండలోని కాల్షియం, విటమిన్ -సి వల్ల ఎముకలు, కీళ్ళు పనితీరు బాగుంటుంది. కండరాలను, ఎముకలను పట్టి ఉంచే సున్నితమైన కణజాలం బలపడుతుంది.
Disclaimer: This blog does not guarantee any specific results as a result of the procedures mentioned here and the results may vary from person to person. The topics in these pages including text, graphics, videos and other material contained on this website are for informational purposes only and not to be substituted for professional medical advice.
0 Comments