Ad Code

తిరుపతిలోని "అలిపిరి" కి ఆ పేరు ఎలా వచ్చింది? - Why The Name Came For Alipiri

తిరుపతిలోని "అలిపిరి" కి ఆ పేరు ఎలా వచ్చింది?



"తిరుమల" కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవాలంటే మనం మొదట కొండ దిగువన ఉన్న "అలిపిరి" ప్రాంతానికి చేరుకోవాలి.

అక్కడినుంచి కాలినడకన లేదా రకరకాల వాహనాలలో మనం సప్తగిరుల పైకి చేరుకుని స్వామివారిని దర్శించుకుంటాం.

అయితే కొండ క్రింద ఉన్న ఈ  "అలిపిరి" కి ఆ పేరు ఎలా వచ్చిందో మనలో చాలామందికి తెలియదు.

అసలు "అలిపిరి" అనే పేరే ఒక విచిత్రమైన పేరు లాగా ఉంది కదా? మన తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం ఇలా ఏ భాషలోనూ ఈ "అలిపిరి" అనే పదం లేదు.

అయితే, "అలిపిరి" అనే ఈ పదం ఎలా పుట్టింది?

దీని వెనుక చరిత్ర ఏమిటి?
అనే విషయం మన చరిత్రని నిశితంగా గమనించినట్లయితే ఆశ్చర్యకరమైన యదార్థ సంఘటలను గురించి మనం తెలుసుకోవచ్చు.

పూర్వం ఐదు వందల సంవత్సరాల క్రితం, "తిరుపతి" నగరం ఇప్పటిలాగా లేదు.

ఇప్పుడు "అలిపిరి" అని పిలుస్తున్న ప్రాంతానికి "అలిపిరి" అన్న పేరు కూడా లేదు.

అది (1656 - 1668) ప్రాంతం. ఢిల్లీలో మొఘల్ చక్రవర్తులు పాలిస్తున్న సమయం. శ్రీ కృష్ణ దేవరాయల అనంతరం జరిగిన "రాక్షసి తంగడి & తళ్ళికోట" మొ|| యుద్ధాల తర్వాత, విజయనగరం రాజుల ప్రాబల్యం తగ్గింది. అప్పుడు నిజాం నవాబు రాయల సీమ ప్రాంతాన్ని ఆక్రమించాడు.

ఆ సమయంలో హిందువులను, హిందూ సానుభూతిపరులను, సాధుసంతులను చాలా దారుణంగా హింసించారు.

ఈ నిజాం నవాబు, ఢిల్లీ సుల్తానుకు - కప్పం కడుతూ సామంతుడిగా పడి ఉంటూ, హిందువులపై నిరాఘాటంగా & ధారావాహికంగా అకృత్యాలు, అరాచకాలు చేస్తూ ఉండేవాడు.

పదిహేడో శతాబ్దం చివరిలో ఢిల్లీ ఆదేశాల మేరకు, హైదరాబాద్ నిజాం ప్రభుత్వం ఫర్మానా (ఆర్డర్) మేరకు సుల్తాన్ అబ్దుల్లా కుతుబ్ షా & వజీర్ల సైన్యం, "ఆలీ" అనే అత్యంత కరడుగట్టిన మహమ్మదీయుని నేతృత్వంలో, కడప, కర్నూలు, నెల్లూరులలో దారుణంగా దాడులు చేసి దేవాలయాలను ధ్వంసం చేసారు. ఆ తరువాత "ఆలీ" సైన్యం తిరుపతికి చేరుకుంది.

అప్పుడు, తిరుపతి చిన్న గ్రామం. ఇప్పుడు "మంచినీళ్ళ కుంట" అని చెప్పుకుంటున్న
"నరసింహ తీర్థమే" అప్పటి తిరుపతి గ్రామం.

ఇక్కడ ఒక నరసింహ స్వామి మందిరం ఉంది, దానికి ప్రజలు నిత్యం ధూప, దీప, నైవేద్యాలు సమర్పిస్తుండేవారు. చరిత్ర తెలిసిన పెద్దవారు ఇప్పటికీ దీనిని "నరసింహ తీర్థం రోడ్" అనే పిలుస్తారు.

ఆలీని తిరుపతికి పైకి దండయాత్రకు పంపించటానికి మూల కారణాలు రెండు:
ఒకటి: శ్రీ వేంకటేశ్వర స్వామి వారు అత్యంత శక్తివంతమైన దేవుడు అనీ, తిరుమల లాంటి దివ్య క్షేత్రం ఇంకొకటి లేదు, భవిష్యత్తులో ఉండబోదు అనే వైభవమ్ విశ్వాసం భారత దేశం నేల నాలుగు చెరలా ఉండడం వలన, ఈ దేవాలయం పై దాడి చేసి స్వామి వారి స్వరూపాన్ని పెకలించి కొండపై నుంచి తొలగించేస్తే, హిందువుల దేవుడు బలహీనుడనీ తద్వారా, ప్రజలందరూ " అల్లా " యే గొప్ప దేవుడని భావించి, " ఇస్లాం " మతాన్ని విధిలేక స్వీకరిస్తారని వారి పిచ్చి ఆలోచన.

రెండోది: శ్రీ కృష్ణ దేవరాయలు, భక్తితో స్వామి వారికి సమర్పించుకున్న విలువ కట్టలేనన్ని వజ్రాలు, వైఢూర్యాలు, కనక పుష్యరాగాలు, కెంపులూ & అపారమయిన బంగారం దోచుకెళ్ళి వాళ్ళ ఖజానా నింపుకుందామని.

అయితే అప్పటి తిరుపతి గ్రామస్తులు, "ఆలీ" (కమాండర్ ఇన్ చీఫ్) ని సమీపించి నీక్కావలసింది బంగారమే కదా! మా తిరుపతి గ్రామంలో ఉన్న స్త్రీ & పురుషుల వద్ద వున్న బంగారం అంతా ఇచ్చేస్తాం, దానితో తృప్తిపడి వెనక్కి వెళ్ళిపో, కానీ మా స్వామి వారి జోలికి రావద్దు, ఆయన మా ప్రాణం కన్నా కూడా ఎక్కువ అని విన్నవించుకున్నారు.

దానికి ఆలీ అంగీకరించినట్లు నటించి వాళ్ళు స్వచ్చందంగా ఇచ్చిన బంగారం, ఆభరణాలు తీసుకుని, మీరు చెప్పింది బాగానే ఉంది కానీ, ఈ దేవాలయాన్ని దోచుకుని ధ్వంసం చెయ్యకపోతే నిజాం నవాబూ & ఢిల్లీ సుల్తాను నా తల తీసేస్తారు కాబట్టి, తప్పదు అని తన అపార బలగాలతో ముందుకు కదిలాడు.

సరిగ్గా ఇప్పుడు "అలిపిరి" అని పిలవబడుతున్న ప్రాంతాన్ని చేరుకోగానే, శ్రీ ఆది వరాహ స్వామి అవతారమైన శ్రీవారు వరాహ రూపంలో వచ్చి నిలువరించారు. మొదట కొంచెం బెదిరినా కూడా ముందుకు కదిలాడు. అంతే హఠాత్తుగా ఎవరి ప్రమేయమూ లేకుండా అతని రెండు కళ్ళూ పోయాయి, దృష్టి పోవడంతో దిక్కులేని స్థితిలో ఎంతో విలపించాడు.

అప్పుడు, శ్రీ స్వామి వారి అమృత వాణి వాడికి వినబడింది, "దైవం పైనే దాడికి సిద్ధపడ్డావా, ఎంతధైర్యం?" అని.

అప్పుడు ఆలీ బిగ్గరగా రోదిస్తూ క్షమాభిక్ష అడిగి, నేత్ర దానం చెయ్యమని వేడుకున్నాడు.
అప్పుడు దయార్ద్రచిత్తుడయిన స్వామి వారు, నీవు వెనుదిరిగి వెళ్ళిపో, నీకు దృష్టి వస్తుందని ఆదేశించారు. దానితో ఏమీ సాధించకుండానే రిక్త హస్తాలతో వెనుదిరిగాడు "ఆలీ".
ఉర్దూ లేక హిందీ భాషలో "ఫిర్ నా" అంటే వెనక్కి మళ్ళడం, "ఫిరే" అంటే వెనక్కి మళ్ళాడు అని అర్థం.

ఎప్పుడు, ఎక్కడా ఓటమెరుగని పరమ ఆ దుర్మార్గుడైన ఆలీ వెనుతిరిగిన వెంటనే ఈ విషయం తెలుసుకున్న అందరూ "ఆలీ ఫిరే, ఆలీ ఫిరే" అని చెప్పుకునేవారు.

కొన్ని సంస్థానాలకి సంబంధించిన గ్రామాలలో అయితే తిరుపతి ఆలయం మీదకు దండయాత్రకు వెళ్లిన ఆలీ తిరుపతిలోని ఒక ప్రదేశం నుంచి ముందుకెళ్లలేక వెనుదిరిగాడు "ఆలీ ఫిరే", "ఆలీ ఫిరే" అని సూచిస్తూ చాటింపులు సైతం వేయించారు.

"ఆలీ" ఏ ప్రాంతం నుంచి వెనక్కి మళ్ళాడో ఆ ప్రాంతాన్నే అప్పటివారు ప్రత్యేకంగా వచ్చి సందర్శించేవారు. ఆ ప్రదేశాన్ని చూడటానికి వెళ్ళేటప్పుడు లేదా వెళ్లి వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్లారని ఎవరైనా అడిగినప్పుడు "అలీ ఫిరే" ప్రదేశానికి వెళ్తున్నామని చెప్పేవారు.

కాలక్రమంగా ఆ ఆలీ ఫిరే అనే పదం, ఆలి పిరే గా రూపాంతరం చెంది ఇప్పుడు "అలిపిరి" గా స్థిరపడింది.

ఇదీ మనమిప్పుడు "అలిపిరి" గా పిలుచుకునే ప్రదేశం యొక్క యదార్థమైన చరిత్ర.

అప్పుడు తురుష్కులు చేస్తున్న, చేసిన దురాగతాలూ మరియు పైన పేర్కొన్న ఘటనల గురించి, "వేంకటాచల విహార శతకము" అని ఒక కవి వ్రాయడం జరిగింది. దీని ఆధారంగా స్వర్గీయ "ఎన్టీఆర్" "వేంకటేశ్వర కళ్యాణం" సినిమాలో కొంత చూపించారు.

ఈ "వేంకటాచల విహార శతకము" లో ముఖ్యం గా (6, 9, 90 & 98) పద్యాలలో, కవి తురుష్కులు చేస్తున్న పాపాలు, దౌర్జన్యాలకు విపరీతంగా కోపం తెచ్చుకుని శ్రీ స్వామి వారిని తీవ్రంగా ప్రశ్నించాడు. మీ గోవిందరాజు బొజ్జ నిండా తిని హాయిగా పడుకున్నాడు, ఇన్ని అరాచకాలు జరుగుతున్నా లేవడా? అని.

పాలు వెన్న బకాళబాతు దధ్యోదనంబు పుళి రెము వెన్న బూరియలును సరడాల పాశముల్? చక్కెర పులగముల్ నువ్వుమండిగలు మనోహరములు, అప్పము లిడైన లతిరసాల్ హోళిగల్ వడలు దోసెలు గలవంటకములు శాకముల్ సూపముల్ చాలు లంబళ్లు శుదనములును సద్యోఘృతమ్ము పండ్లు తేనెలు హొబ్బట్లు పచ్చడులును మెక్కి మము బోంట్లు గ్రుక్కిళ్లు మ్రింగుచుండ బర్వసేయవు నీవంటి బ్రదుకుగాదె శత్రు సంహార వెంకటాచల విహార (వేంకటాచల విహార శతకం)

సుల్తానుల సైన్యం చేస్తున్న ఆగడాలను భరించలేక వారిని నశింపజేయమని కోరుతూ ఓ అజ్ఞాత కవి ఈ శతకం వ్రాశాడు.

ఆరోజుల్లో సుల్తానుల సైన్యం ఆలయాలలోకి వెళ్ళి విగ్రహాలను నాశనం చేసేవాళ్లు. జిగురుపాల కోసం అనే వంకతో దేవాలయాలలో ఉండే రావి చెట్లను నరికేసేవాళ్లు. గుడి పూజారులు నుదుట పెట్టుకునే నామాలను బలవంతంగా తుడిపేయించేవాళ్లు.

ఇలా అరాచకాలు చేసే అల్లరిమూకల్ని అడ్డగించి గెలవడం ఓ వేంకటేశా నీకైనా శక్యమేనా? ఏదో వెఱ్రితనం కొద్దీ నీకు అంటూ దేవుణ్ణి రెచ్చగొట్టే పద్యాలు ఇందులో కనిపిస్తాయి.

కొండపైన నువ్వు కొండ దిగువన మీ అన్న గోవిందరాజ స్వామి లేవనైనా లేవకుండా మొద్దు నిద్ర పోతున్నారని ఆరోపిస్తాడు ఈ కవి. ఆయన పేరు ఈ శతకంలో ఎక్కడా కనిపించదు.

ఈ విధంగా శ్రీవారి మహిమ వలన ఆలీ వెనుదిరిగిన కారణంగా, ఈనాడు మనం చూస్తున్న "అలిపిరు" ఏర్పడింది .

కొసమెరుపు: ఒక్క ఆలీనే కాదు, తిరుమల శ్రీవారి ఆలయం గురించి, ఏడు కొండల గురించి కానీ, లేదా స్వామి వారిని గురించి కానీ తప్పుగా మాట్లాడినవారు, తప్పుడు ఆలోచనలు చేసిన వారు ఎందరో కాలగర్భంలో కలిసి పోయారు.

కానీ, అన్ని కాలాలకి, అన్ని సంఘటనలకి ఆ సాక్షిభూతుడిగా సర్వకాల సర్వావస్థుడిగా ఆ శ్రీవారు చిరునవ్వులు చిందిస్తూ మన కళ్ళ ముందే ఉన్నారు, అదే ఆయన వైభవమ్.
ఆయనే మన హిందూ వైభవానికి ప్రత్యక్ష సాక్షి.




సర్వేజనాః సుఖినోభవంతు
శుభమస్తు
గోమాతను పూజించండి, గోమాతను సంరక్షించండి.



Alipiri Padala Mandapam or Alipiri is the place at foot of seven hills in Tirupati, the pilgrim city of Sri Venkateswara Swami, in the state of Andhra Pradesh, India. One Footstep way and two road ways, one up and one down, leading to Tirumala through seven hills starts from Alipiri and hence it got the name "The Gate Way to Tirumala Venkateswara Temple"

In older days pilgrims used to climb all the seven hills only through the stepped way on foot, as there was no other option. Hence the pilgrims came from long distances used to take rest for some time there, cooked their food, eat there. After taking rest they started to climb the steps.

Nowadays all the stepped way is covered with roof to protect the pilgrims from sun light and rain. The lights are also provided. Special privilege is provided to the pilgrims who came on foot for the visit of the god.

Srivari Padala Mandapam
Srivari Padala Mandapam is a temple dedicated to Lord Venkateswara at Alipiri. The presiding deity is referred to Padala Vennkateswara Swamy. As per legend Lord Venkateswara after Ekantha seva at Tirumala will come visit his consort Padamavati at Tiruchanur, down the hill through Alipiri Steps path and will leave his footwear at this place and hence the name "Padala Mandapam"(Telugu : Padalu refers to Foot). Devotees going on Tirumala Yatra from Tirupati will offer prayers here first by carrying "Srivari Padukalu"(believed to be footwear worn by Lord Venkateswara himself) on their heads. The temple comes under Sri GovindarajaSwamy Temple circle and is being administered by Tirumala Tirupati Devasthanams.

Sri Lakshmi Narayana Swamy Temple
There is sub-temple dedicated to Lord Lakshmi Narayana in the Alipiri Padala Mandapam Temple complex which lies east of Padala Mandapam. The temple entrance and the deity faces towards west. It has sub-shrine dedicated for Andal.

Sri Vinayaka Swamy Temple
There is also temple dedicated to Lord Ganesha in the Alipiri Padala Mandapam Temple complex which lies on the 2nd Ghat Road leading from Tirupati to Tirumala. Devotees going by Road will offer prayers at this temple before starting Tirumala Yatra.






Post a Comment

0 Comments