Ad Code

ఈశ్వరుడికి భక్తుడిగా ఉండాలంటే, కొన్ని అర్హతలు నియమాలు పాటించాలి - How can we be a true devotee of Lord Shiva?

ఈశ్వరుడికి భక్తుడిగా ఉండాలంటే,
కొన్ని అర్హతలు నియమాలు పాటించాలి


ఈశ్వరుడికి భక్తుడిగా కావాలంటే నుదుట నామాలు మెడలో రుద్రాక్ష మాలలు ధరించవచ్చు.

కానీ భక్తికి అవే నిదర్శనం కాకూడదు.

ఎప్పుడూ ఒకరి గురించి అలోచించి అసూయ పడకూడదు అహంకారం ఉండకూడదు.

వేడి కలిగిన చలి కలిగిన సుఖము వచ్చిన దుఃఖము వచ్చిన సమానత్వం ఉండాలి.

క్షమా గుణం కలిగి ఉండాలి ఎప్పుడూ నిత్య తృప్తిగా ఉండాలి.

దృఢమైన విశ్వాసం ప్రేమ కలిగి ఉండాలి ఎవ్వరినీ భయ పెట్టకూడదు.

మీరు ఎప్పుడూ భయపడకూడదు. ధర్మ జీవనం గడపుతూ జీవించాలి.

ఎటువంటి చింతనలు పెట్టుకోకుండా ఉండాలి. పరిశుద్ధంగా ఉండాలి.

ఎటువంటి కర్మలు చేస్తున్నా దానికి కర్తను నేను కాదు అంతా ఈశ్వరుడే అనుకోవాలి.

కర్మ ఫలము మంచిగా లేక చెడుగా వచ్చిన మన ప్రారబ్ధం అనుసారంగా వచ్చింది అని అనుకోవాలి.

మిత్రులను శత్రువులను సమాన దృష్టితో చూసి వారిని మంచి బుద్ధితో పలకరించాలి.

జంతువులపై పక్షులపై దయ చూపించాలి.

నిరంతరం భగవంతుని నామాలు స్మరిస్తూ భజనలు చేస్తూ పాటలు వింటూ ప్రవచనాలు వింటూ ఆధ్యాత్మిక జీవితంగా బ్రతకాలి.


సర్వేజనాః సుఖినోభవంతు
శుభమస్తు
గోమాతను పూజించండి, గోమాతను సంరక్షించండి.






Post a Comment

0 Comments