Ad Code

శ్రీ గణేశ ప్రార్థన - Shri Ganesha Prayer

గణేశ ప్రార్థన


తొండము నేకదంతము తోరపు బొజ్జయు వామహస్తమున్
మెండుగ మ్రోయుగజ్జెలును మెల్లని చూపులు మందహాసమున్
కొండొక గుజ్జురూపము కోరిన విద్యలకెల్ల నొజ్జయై యుండెడి
పార్వతీ తనయ ఓయి గణాధిప నీకు మ్రొక్కెదన్ ||

తొలుత నవిఘ్నమస్తనుచు ధూర్జటి నంద నీకు మ్రొక్కెదన్
ఫలితము సేయుమయ్య నిను బ్రార్ధన జేసెడ నేకదంత నా
వలపలి చేతి గంటమున వాక్కున నెప్పుడు బాయకుండు మీ
తలపున నిన్ను వేడెదను దైవగణాధిప లోక నాయకా ||

తలచితినే గణనాధుని! తలచితినే విగ్న పతిని దలచిన పనిగా
దలచితినే హేరంబుని దలచితినా విగ్నములను తొలగుట కొరకున్ ||
అటుకులు కొబ్బరి పలుకులు చిట్టి బెల్లము నాను బ్రాలు చెరకుర సంబున్
విటలాక్షునగ్ర సుతునకు పటుతరముగ విందు చేత ప్రార్ధింతు మదిన్ ||





Post a Comment

0 Comments