Ad Code

రుద్రరూపా (చతురక్షరి) - Chaturakshari

రుద్రరూపా (చతురక్షరి)


ఇది నాల్గు అక్షరాల మంత్రము. పూజాసమయంలో "రుద్రరూపాయై నమః" అని శ్రద్ధా భక్తులతో ఉచ్చరించాలి.

రుద్ర - రూపా = రుద్రుని రూపంలో గలది శ్రీదేవి.

రుద్ర పదానికి తాత్త్వికులు నిర్వచనాన్ని బహు విధాలుగా బోధిస్తారు.

"రుజం ద్రావయతే పరిహరతి ఇతి రుద్రః" అనగా సంసార దుఃఖమును తొలగించువాడు.

"రోదయతి సంతాపయతి కామాది దుర్గుణాన్ ఇతి రుద్రః" అనగా కామ క్రోదాధి దుర్గుణాలను శమింపజేసే వాడు కనుక రుద్రుడు.

"ప్రళయకాలే రౌద్రాకారేణ సర్వ సృష్టిం నాశయతి ఇతి రుద్రః" - ప్రళయ కాలంలో సమస్త సృష్టిని రౌద్రాకారంతో ప్రళయ నృత్యం చేసి నశింపజేసేవాడు.

ఇలా ఎన్నియో అర్థాలు నిర్వచిస్తారు. రుద్రునికి పశుపతి - ఈశుడు - శివుడు మొదలైన పదాలు గలవు. వాటికినీ ఇలాగే - తత్త్వ శాస్త్రానుగుణంగా అర్థాలను బోధిస్తారు. ఆశ్రితులకు సంసార బాధలు తొలగించి పదవిని గల్గించేది శ్రీదేవి అని సారాంశము.

ఈ రుద్రులు ఏకాదశ విధంగా ఉన్నారు. వారి నామములు: 
1. అజుడు 
2. ఏక పాదుడు 
3. అహిర్భుధ్నుడు 
4. త్వష్ట 
5. రుద్రుడు 
6. హరుడు 
7. శంభుడు 
8. త్ర్యంబకుడు 
9. అపరాజితుడు 
10. ఈశానుడు 
11. త్రిభువనుడు

వీరినే ఏకాదశ రుద్రులు అని పిలుస్తారు. ఏకాదశ రుద్ర రూపిణియైనది శ్రీదేవి.
ఈ నామంతో దేవిని ఉపాసించే సాధకులకు సృష్టితత్త్వం అవగతం అవుతుంది. ఏకాగ్రత గల్గుతుంది. క్రమంగా ముక్తి లభిస్తుంది.




Post a Comment

0 Comments