Ad Code

అతిపెద్ద ఏకశిలా గణపతి విగ్రహం - Ancient Eka Shila Ganapati Idol In Avancha Village

అతిపెద్ద ఏకశిలా గణపతి విగ్రహం



దక్షిణ భారతదేశంలో అతిపెద్ద ఏకశిలా వినాయక రాతివిగ్రహం ఇది. నాగర్ కర్నూల్ జిల్లా ఆవంచ గ్రామంలో ఉంది. 25 అడుగుల ఎత్తు, 15 అడుగుల వెడల్పు ఉంది.

ఆవంచ గణపతి విగ్రహం క్రీ.శ.10-12 శతాబ్దాల కాలం నాటిదని పురాతత్వ శాఖ నిర్ధారించి చెప్పింది. ఈ విగ్రహాన్ని కాకతీయులకు సామంతులుగా వ్యవహరించిన కందూరు చోళులు నిర్మించినట్లు కనుగొన్నారు. ఆచంట గ్రామంలో శివపార్వతులు, మహిషాసురమర్ధిని, గణపతి, భైరవుడు, నంది విగ్రహాలు కూడా బయటపడ్డాయి. వాటన్నిటినీ జిల్లాలో పిల్లలమర్రిలోని మ్యూజియానికి తరలించి భద్రపరిచారు. కానీ ఈ భారీ గణపతి విగ్రహాన్ని మాత్రం అలాగే వదిలేశారు.




Post a Comment

0 Comments