Ad Code

రోగనిరోధక శక్తి పెంచే ఆహారాలు - How to Increase Immunity Power

రోగనిరోధక శక్తి పెంచే ఆహారాలు



మనలో చాలామందికి మనం తీసుకునే ఆహారం మీద సరైన అవగాహన ఉండదు. సమయానికి ఏది పడితే అది తినేయడం ఆ తరువాత వ్యాధులను మన చేజేతులా మనమే కొనితెచ్చుకుంటున్నాం. మానవులకు రోగాలు రావడానికి ప్రధాన కారణం మనం తీసుకునే ఆహారమే. అతిగా తినటం కూడా రోగకారణమే. ఆయుర్వేదం నందు ఒక సూక్తి ఉంది."త్రికాల భోజనే మహారోగి, ద్వికాల భోజనే మహాభోగి, ఏకకాల భోజనే మహాయోగి" అని చెప్తారు. ఏది పడితే అది కడుపు నిండా తిని జబ్బులను కొనితెచ్చుకోవద్దు. మీరు తినే ఆహారం మీ ఉదరము నందు సగభాగం పట్టునట్టు తిని పావుభాగం నీటికొరకు, మిగిలిన పావుభాగం వాయుప్రసారానికి అనుగుణంగా వదలవలెను. మనం తీసుకునే ఆహారం తక్కువ మోతాదులో ఉన్నను మనశరీరానికి మంచి బలాన్ని, రోగనిరోధకశక్తి ఇచ్చే ఆహారం అయ్యి ఉండవలెను.

వరి, గోధుమ, ఇతర ధాన్యాలు:
మన ప్రధాన ఆహారాలు ఐన  వరి, గోధుమ వంటి ఆహారధాన్యాలు పైన పొట్టు తీయకుండా (పాలిష్) తీసుకొనుచున్న ఇవి చాలా బలమైన ఆహారపదార్దాలు. పొట్టులో విటమిన్లు ఉంటాయి. పొట్టులో ఉండే ఒక ముఖ్యమైన విటమిన్ ధాన్యాన్ని పాక్షికంగా ఉడికించడం వల్ల (ఉప్పుడు బియ్యం) గింజలోపలి భాగానికి వెళ్తుంది. దంపిన బియ్యం, ఉప్పుడు బియ్యం పొట్టు తీసిన (పాలిష్) బియ్యం కంటే చాలా మంచివి. 

ఎండబెట్టిన మొక్కజొన్నలు:

ఎండబెట్టిన మొక్కజొన్నలు వండే ముందు పలచటి సున్నపుతేటలో నానబెడితే వాటిలో ఉన్న "నియాసిన్" అనే విటమిన్, మాంసకృత్తుల్ని శరీరం బాగా ఉపయోగించుకోగలుగుతుంది.

రాగులు, సజ్జలు, చోళ్లు:

వీటిలో ఖనిజ లవణాలు ఎక్కువుగా ఉంటాయి. ముఖ్యంగా క్యాల్షియం, ఇనుము ఎక్కువుగా ఉంటాయి. ఇవి వరి, గోధుమ కంటే చౌకైనవి, ఎక్కువ బలవర్థకమైన ఆహారాలు. వరి, గోధుమలకు బదులు వీటిని తీసుకోవచ్చు. 

పప్పులు:

ఏదో ఒక పప్పు కంటే అనేక పప్పుల మిశ్రమం మంచిది. ఒక్కో రకమైన పప్పులో ఒక్కో రకమైన మాంసకృత్తులు ఉంటాయి. పప్పుల మిశ్రమం శరీరానికి కావలసిన అన్నిరకాల మాంసకృత్తులను అందిస్తుంది. 

చిక్కుళ్ళు, బటానీలు, సోయాబీన్స్:
ఇవి చౌకగా దొరికే మాంసకృత్తులు. పొలాల్లో వీటిని పెంచడం వల్ల భూమిసారం పెరిగి తరువాత వేరే పంట వేస్తే బాగా పెరుగుతుంది. అందువల్ల పంటను మార్చుతూ ఉండాలి. 

ఆకుకూరలు:

ఎక్కువుగా పచ్చగా ఉన్న ఆకుకూరల్లో కొంచం మాంసకృత్తులు, కొంచం ఇనుము, విటమిన్ A ఎక్కువుగా ఉంటుంది. చిలగడదుంప, చిక్కుడు, బటాణీ, గుమ్మడికాయల ఆకులు చాలా బలవర్ధకమైనవి. వీటిని ఎండబెట్టి పొడిచేసి బిడ్డలకు అన్నంలో కలిపి పెట్టుచున్న మాంసకృత్తులు, విటమిన్లు లభిస్తాయి.

క్యాబేజి లాంటి లేతాకు పచ్చ ఆకుకూరలలో మాంసకృత్తులు, విటమిన్లు కూడా చాలా తక్కువ ఉంటాయి. మంచి పోషక విలువలు కలిగిన ఆహారం కాదు కాబట్టి పెద్దగా తీసుకోవలసిన అవసరం లేదు.


దుంపకూరల ఆకులు:

ముల్లంగి, కర్రపెండలం మొదలైన మొక్కల్లో వాటి దుంపల కంటే ఆకులలో ఎక్కువ పోషకపదార్ధాలు ఉంటాయి. కర్రపెండలం ఆకుల్లో, దుంపల కంటే 7 రెట్లు అధికంగా మాంసకృత్తులు, విటమిన్లు ఉంటాయి. దుంపతో కలిపి తింటే ఇంకా ఎక్కువ బలం. లేత ఆకులు చాలా బలం ఇస్తాయి. 

కాయగూరల్ని, బియ్యాన్ని, ఇతర పదార్ధాలని కొంచం నీటిలో ఉడకబెట్టాలి. ఉడకబెట్టటానికి ముందు కాయగూరలను కోయవలెను. అతిగా ఉడకపెట్టకూడదు. అలా ఉడకపెట్టడం వలన కొంత విటమిన్లు, లవణాలు పోతాయి. ఉడకపెట్టాక మిగిలిన నీటిని పారబోయకూడదు. ఆ నీటిని తాగడమో లేక సూప్ లా చేసుకుని తాగిన చాలా మంచిది. 


కాయగూరలని వండేప్పుడు కొంచం చింతపండు కలిపిన విటమిన్లు పోవు. ఎండి, వాడిపోయిన కూరగాయలకంటే తాజాగా ఉన్నవి ప్రశస్తమైనవి. బలమైనవి. అడవుల్లో దొరికే చాలా పండ్లలో విటమిన్ "C " సహజమైనది ఉండును. పంచదార కూడా అధికంగా ఉండును. విటమిన్ల కొరకు ఈ పండ్లను తీసుకోవచ్చు. తినడానికి ముందు అవి విషపూరితమైనవా ? కావా? అన్నది చూసుకోవడం ఉత్తమం. 


ఇనప పాత్రలలో వండడం వలన లేదా చిక్కుళ్లు లాంటివి ఉడకపెట్టేప్పుడు పాత్రలో తుప్పుపట్టిన ఇనుప ముక్క వేసి ఉడకపెట్టిన ఆ ఆహారము నందు ఇనుము శాతం పెరిగి రక్తహీనత రాకుండా చూస్తుంది. బెల్లాన్ని ఇనుపపాత్రలో తయారుచేయడం వలన ఆ బెల్లము నందు ఇనుము శాతం ఎక్కువుగా ఉండును. పంచదారకు బదులు బెల్లం వాడటం ఆరోగ్యానికి చాలా మంచిది. 


పైన చెప్పిన ఆహారాలు మాత్రమే కాకుండా, గుడ్లు, మాంసాహారం కూడా శరీరానికి బలం ఇచ్చును. ఇవి అలవాటు లేనివారు పప్పు, తాజా కూరగాయలు, పండ్లు తీసుకొని శరీరం నందు రోగనిరోధక శక్తి పెంచుకోవచ్చు. ఎంత ఎక్కువ తింటున్నాం అన్నది కాదు, ఎంత బలమైన ఆహారం తీసుకుంటున్నాం అన్నది ముఖ్యం. 


Disclaimer: This blog does not guarantee any specific results as a result of the procedures mentioned here and the results may vary from person to person. The topics in these pages including text, graphics, videos and other material contained on this website are for informational purposes only and not to be substituted for professional medical advice.





Post a Comment

0 Comments