Ad Code

చిన్మయీ (త్యక్షరి)

చిన్మయీ (త్యక్షరి)



ఇది మూడు అక్షరముల మంత్రము. పూజాసమయంలో “చిన్మయ్యై నమః" అని శ్రద్ధా భక్తులతో ఉచ్చరించాలి.
చిత్ - మయీ = జ్ఞాన స్వరూపిణియైనది శ్రీదేవి.
వేదాంతశాస్త్రము - జ్ఞానము, శ్రేయము, జ్ఞాత అనే త్రిపుటిని వివరించి వాటికి ఏకత్వాన్ని బోధిస్తుంది.

ఈ తాంత్రిక పరిభాషలో:
చిద్ బిందువు
ప్రకాశ బిందువు
విమర్శ బిందువు

అని మూడు బిందువులను బోధిస్తారు. వీటిని త్రికోణం ద్వారా సూచించి, కోణ మధ్యము నందుండే అహం బిందువుతో సమన్వయం చేస్తారు. అనగా, త్రిపుటి లయం గావిస్తారు.
ప్రకాశ, విమర్శ బిందువులు ఊర్ధ్వమున ఉండే చిద్బిందువుతో చేరి తద్వార అహం పదార్ధమైన ఆత్మబిందువులో లీనతను పొంతుతాయి. ఆత్మానుభూతి కారకము చిద్బిందువు అగును.
ఈ మంత్రముతో దేవిని ఉపాసించే సాధకులు చిన్మయతను పొంది తరింతురు.





Post a Comment

0 Comments