అరటి ఆకులో భోజనం చేయడం వలన కలిగే ప్రయోజనాలు
పచ్చగా ఉండే అరటి ఆకులో ఆహారం పెట్టుకుని తినడం వల్ల త్వరగా జీర్ణమవుతుంది. అలాగే మోదుగ ఆకులతో కుట్టిన విస్తరిలో భోజనం చేస్తే జ్ఞాపకశక్తి పెరుగుతుందనీ, మనస్సుకు ప్రశాంతత లభిస్తుందని అంటుంటారు.
ఆకుపచ్చని అరటి ఆకులో భోజనం చేయడం వల్ల కఫవాతాలు తగ్గిపోతాయి. శరీరానికి బలం చేకూరుతుంది. బాగా ఆకలివేస్తుంది. ఆరోగ్యం చక్కబడి శరీరానికి మంచి కాంతి వస్తుంది.
అరటి మోదుగ ఆకులలో భోజనం చేయడం వల్ల ప్రేవులలోని క్రములు నాశనమవుతాయని ఆయుర్వేదం కూడా చెపుతోంది. అలాగే అరటి చెట్టు నుంచి వచ్చే అరటి పండు కూడా ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
అరటి పండులోని పొటాషియం శరీర కండరాలను కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది. జీర్ణ సంబంధ సమస్యలను కూడా అరటిపండు మంచి ఔషధంలా పనిచేస్తుంది. జబ్బుపడినవాళ్లు దీనిని తీసుకుంటే త్వరగా కోలుకుంటారు. అరటిపండు అల్సర్లను నివారించడంలో క్రియాశీలకంగా పనిచేస్తుంది.
మహావిష్ణు స్వరూపమైన మర్రిచెట్టు ఆకులలో అన్నం తింటే క్రిమిరోగ నివారిణిగా పనిచేస్తుంది. కంటికి సంబంధించిన దోషాలను తొలగిస్తుంది.
0 Comments