Ad Code

పుదీనా ఉపయోగాలు - Amazing Health Benefits of Mint

పుదీనా - ఉపయోగాలు



ఆయుర్వేదం నందు పుదీనా కు ప్రత్యేక స్థానం ఉన్నది. 100 గ్రాముల పుదీనా ఆకు 56 క్యాలరీల శక్తిని ఇస్తుంది.  ఇవే కాకుండా మరెన్నొ పోషకాలు ఉన్నాయి.
100 గ్రాముల పుదీనా ఆకులో ఉండే పోషకాలు:
పిండిపదార్దాలు  - 8 .40 గ్రా, ప్రొటీన్స్ - 5 .90 గ్రా, 0 .70 గ్రా ఫ్యాట్స్, క్యాల్షియం - 440 మి.గ్రా,  ఫాస్ఫరస్ - 70 మి.గ్రా, ఐరన్ - 19 .2 మి.గ్రా, విటమిన్లు - A, B1, B2, నియాసిన్, ఆక్సాలిక్ ఆసిడ్ ఉన్నాయి.
పుదీనా ఆకు ఎక్కువుగా మాంసాహార వంటకాలలో వాడతారు. పచ్చడిగా మనవారు చాలాకాలం నుంచి ఉపయోగిస్తున్నారు. పుదీనా ఆకు నుంచి "పిప్పర్మెంట్" నూనె తయారగును. దీనితో కూడా అనేక వైద్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ నూనెని ఘనీభవింపచేసిన మనము కిళ్ళీలలో వాడే "పిప్పరమెంట్" తయారగును. పిప్పర్మెంట్ నోట్లో వేసుకొనిన వేడిగా ఉండి బయట గాలి కొద్దిగా సోకగానే చల్లగా ఉన్నట్లు అనిపిస్తుంది.

పుదీనా ఆకుతో చికిత్సలు:
పుదీనా ఆకు రసములో 1 స్పూన్ నిమ్మరసం, కొద్దిగా తేనె కలిపి ప్రతిరోజూ 3 సార్లు చొప్పున తీసుకొనుచున్న అజీర్తి, కడుపునొప్పి, పొట్ట ఉబ్బరం, పొట్టలో గ్యాస్, విరేచనాలు, విరేచనములో నులిపురుగులు, రక్తహీనత సమస్యల నుండి విముక్తి లభించును. 

పుదీనాకు కషాయం రోజుకి 2 లేక 3 పర్యాయాలు సేవిస్తున్న ఎక్కిళ్లు, దగ్గు, జలుబు, అజీర్తి తగ్గును.


బహిష్టులో నొప్పికి పుదీనాకు కషాయం బహిష్టుకు 3 నుంచి 4 రోజుల ముందుగా సేవించటం మొదలుపెట్టిన బహిష్టునొప్పి రాదు.


పుదీనాకు కషాయం నందు కొంచం ఉప్పు కలిపి గొంతులో పోసుకొని గార్గిలింగ్ (గుడగుడ) చేయుచున్న గొంతునొప్పి తగ్గును.


క్షయ, ఉబ్బసం, కొన్ని ఊపిరితిత్తుల వ్యాధులకు ఆయా మందులతో పాటు ఒకస్పూను పుదీనాకు రసములో 2 స్పూనుల వెనిగార్, తేనె, కేరట్ రసము కలిపి రోజుకి 2 సార్లు సేవించిన మంచి టానిక్ లా పనిచేస్తుంది.

నోటి దుర్వాసన గలవారు ప్రతిరోజు పుదీనాకు కొంచం నములుతున్న దుర్వాసన నిర్మూలమగును. ఇంకా దంతాలు పుచ్చుట తగ్గిపోయి దంతాలు గట్టిపడును. 

దంతాల నుండి చీముకారు సమస్య ఉన్నవారు పుదీనాకు నములుతున్న చీము కారుట తగ్గును. దంతాలు ఊడుట తగ్గును. 


ప్రతిరోజూ నిద్రించుటకు ముందు పుదీనాకు ముఖమునకు రాసుకొనుచున్న ముఖంపైన మొటిమలు తగ్గిపోయి ముఖచర్మం మృదువుగా, అందముగా తయారగును. 


గజ్జి, దురద వంటి చర్మవ్యాదులలో పుదీనాకు రసం పైపూతగా వాడుచున్న చర్మవ్యాధులు అంతరించును, నొప్పులు తగ్గును.


పిప్పరమెంట్ తైలములో కొద్దిగా పంచదారను కలిపి 2 నుంచి 3 చుక్కలు కడుపులోకి తీసుకొనుచున్న కడుపుబ్బరం, ఆహారం అరగకుండా ఉండటం, అజీర్తి తగ్గును. 


కొబ్బరినూనెలో కొద్దిగా పిప్పరమెంట్ తైలం కలిపి కీళ్ళనొప్పులకు పైపూతగా రాయుచున్న గుణం కనిపించును. 


గొంతునొప్పికి, గొంతులోని టాన్సిల్స్ కు పైపూతగా పిప్పరమెంట్ తైలాన్ని రాయుచున్న తగ్గును.


పిప్పరమెంట్ నూనెలో కొద్దిగా లవంగ నూనె కలిపి పుచ్చుపళ్ళలో పెడుతున్న నొప్పి తగ్గుటయే కాక క్రమక్రమంగా పుచ్చు అంతరించును. 


నిమ్మరసములో కొద్దిగా పిప్పరమెంట్ తైలము కలిపి రాత్రిపూట ఒంటికి పట్టించుకుని పడుకున్న దోమలు దరిచేరవు.


పైన చెప్పిన యోగాలే కాకుండా విరేచనాలు, జిగటవిరేచనాలు యందు పనిచేయును. హృదయమునకు మంచిది. గర్భాశయ దోషాలను పోగొట్టి రుతుస్రావం సరిగ్గా అగునట్లు చేయును. బాలింతలకు వచ్చు జ్వరం నందు పుదీనాకుల రసం తీసి రెండు చెంచాలు చొప్పున తాగించుట మంచిది. జలుబు నందు పుదీనాకు ముద్దగా చేసి నుదురుకు పట్టించి జలుబు, తలనొప్పి తగ్గును.

Disclaimer: This blog does not guarantee any specific results as a result of the procedures mentioned here and the results may vary from person to person. The topics in these pages including text, graphics, videos and other material contained on this website are for informational purposes only and not to be substituted for professional medical advice.





Post a Comment

0 Comments