Ad Code

పరగడుపునే నిమ్మరసం తీసుకుంటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయొజనాలు - Amazing Health Benefits Of Lemon Hot Water

పరగడుపునే నిమ్మరసం తీసుకుంటే కలిగే
అద్భుతమైన ఆరోగ్య ప్రయొజనాలు


చాలా మంది ఉద‌యాన్నే వేడి వేడిగా కాఫీ లేదా టీ తాగి రోజు మొద‌లు పెడ‌తారు. దీంతో నిద్ర మ‌త్తు వ‌దిలి యాక్టివ్‌గా ఉండ‌వ‌చ్చ‌ని వారి భావ‌న‌. అయితే ఆరోగ్య‌ప‌రంగా చెప్పాలంటే ఉద‌యాన్నే ఈ డ్రింక్స్‌ను తాగడం అంత మంచిది కాదు. వీటితో జీర్ణ స‌మ‌స్య‌లు వ‌స్తాయి. అలా కాకుండా ఉద‌యాన్నే ఒక గ్లాస్ గోరు వెచ్చటి నీటిలో కొంచం నిమ్మ రసం కలుపుకొని తాగితే చాలా ర‌కాల ఆరోగ్య‌క‌ర ప్రయోజనాలు క‌లుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఉద‌యాన్నే ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిలో కొద్దిగా నిమ్మ‌ర‌సం క‌లుపుకుని తాగితే శ‌రీరంలో ఉండే విష‌, వ్య‌ర్థ ప‌దార్థాలు బ‌య‌టికి వెళ్లిపోతాయి. దీంతో శ‌రీరం అంత‌ర్గ‌తంగా శుభ్ర‌మ‌వుతుంది.

జీర్ణ స‌మ‌స్య‌లు పోతాయి. జీర్ణాశ‌యం శుభ్ర‌మ‌వుతుంది. గ్యాస్‌, అసిడిటీ, మ‌ల‌బ‌ద్ద‌కం వంటి స‌మ‌స్య‌లు రావు. తిన్న ఆహారం కూడా స‌రిగ్గా జీర్ణ‌మ‌వుతుంది.


విట‌మిన్ సి ఎక్కువ‌గా ఉండ‌డం వ‌ల్ల శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. బాక్టీరియా, వైర‌స్ ఇన్‌ఫెక్ష‌న్లు రావు. జ్వ‌రం, ద‌గ్గు, జ‌లుబు వంటివి త్వ‌ర‌గా త‌గ్గుముఖం ప‌డ‌తాయి.


జీర్ణక్రియలో సాయపడుతుంది మీరు అజీర్తితో బాధపడుతుంటే, ఈ తేనె, నిమ్మరసం మీ జీర్ణక్రియను బాగుచేస్తుంది. ఈ టానిక్ ను తాగటం వలన బైల్ రసం, కడుపులో యాసిడ్లు స్రవించటానికి సాయపడి, ఆహార పదార్థాలు చక్కగా విడగొట్టబడతాయి. అలా మీ శరీరం పోషకాలను పీల్చుకుంటుంది. ఇంకా తేనె, నిమ్మరసం తాగటం వలన, మీ ప్రేగుల కదలికలు కూడా మెరుగుపడి, కడుపు ఉబ్బరం తగ్గుతుంది.

శరీరంలో విషపదార్థాలను తొలగిస్తుంది మీకు మొటిమలు లేదా మలబద్ధకం తగ్గాలంటే తేనెతో నిమ్మరసాన్ని కలిపి తీసుకోవటం మంచి పరిష్కారం. శ్వాసకోశం,చర్మం, కాలేయం కింద పొరల్లో పేరుకునే విషపదార్థాలను తొలగిస్తుంది. కాలుష్యం, హానికారక రసాయనాలు ఈ విషపదార్థాలకి కారణం. అందుకని, నిమ్మ,తేనె రసం కాలేయానికి విషపదార్థాలను తొలగించి, శరీరాన్ని శుభ్రం చేయటంలో మంచి టానిక్ గా పనిచేస్తుంది.

చర్మాన్ని శుభ్రపరుస్తుంది తేనె, నిమ్మరసం మొటిమలు లేని మొహాన్ని పొందటానికి మంచి ఇంటి చిట్కా. ప్రతిరోజూ పొద్దున్నే ఈ రసాన్ని గోరువెచ్చని నీరుతో కలిపి తాగటం వలన చర్మంలో సహజకాంతి వస్తుంది. నిమ్మకాయలో ఉండే లక్షణాలు చర్మంపై నుండి ఎక్కువగా ఉండే జిడ్డును తీసేస్తుంది. ఇంకా,ఈ రసంలో ఉండే సిట్రిక్ యాసిడ్ ఫ్రీ రాడికల్స్, జీర్ణవ్యవస్థలో విషపదార్థాలను తొలగిస్తుంది.

రోగనిరోధక శక్తి పెరగటంలో సాయపడుతుంది తేనె కలిపిన నిమ్మరసాన్ని తాగటం వలన రోగనిరోధకశక్తి పెరిగి వాతావరణ మార్పుల వలన వచ్చే అంటు వ్యాధులనుండి శరీరాన్ని కాపాడుతుంది.జలుబు, జ్వరాలతో బాగా పోరాడుతుంది, ఎందుకంటే తేనెలో ఉండే ప్రొటీన్లకి యాంటీమైక్రోబియల్, బ్యాక్టీరియా వ్యతిరేక లక్షణాలు ఉంటాయి. నిమ్మ, తేనె నీరు జబ్బు త్వరగా నయమవటంలో కూడా సాయపడుతుంది.

మెటబాలిజాన్ని మెరుగుపరుస్తుంది నిమ్మరసంలో తేనె కలపటం వలన శరీరంలో మెటబాలిజాన్ని పెంచి , ప్రేగుల కదలికను క్రమబద్ధం చేస్తుంది. దానితోపాటు, ప్రతిరోజూ పొద్దున్నే దీన్ని తాగటం వల్ల కొవ్వు కరిగి మీరు ఆరోగ్యంగా, యాక్టివ్ గా ఫీలవుతారు.

గొంతు ఇన్ఫెక్షన్ కి మంచి చిట్కా గొంతు ఇన్ఫెక్షన్లని సిట్రస్ మరింత పెంచుతుందనే సాధారణ అపోహ చాలానే ఉంది కానీ నిజం దానికి పూర్తిగా వ్యతిరేకం. నిమ్మరసం మ్యూకస్ ను తగ్గేలా చేస్తుంది, దానివల్ల గాలి వెళ్ళే నాళం ఖాళీ అవుతుంది. డిస్ ఇన్ఫెక్టంట్ లక్షణాలుండే తేనె గొంతులో ఏర్పడ్డ ఎక్కువ కఫాన్ని కరిగించి, శ్వాసనాళాన్ని ఖాళీ చేస్తుంది.

మీ ఓపికను పెంచుతుంది తేనె సహజంగా శక్తిని పెంచే పదార్థం, పంచదారకన్నా తినటానికి చాలారెట్లు ఆరోగ్యకరమైనది. ఇందులో ఉండే బ్యాక్టీరియాను చంపే లక్షణాలు శరీరంలో శక్తిని పెంచి, మిమ్మల్ని యాక్టివ్ గా మారుస్తుంది.

చ‌ర్మం కాంతివంతంగా మారుతుంది. వెంట్రుక‌లు ప్ర‌కాశ‌వంతంగా మారుతాయి. శిరోజాలు దృఢంగా, ఒత్తుగా పెరుగుతాయి.

Disclaimer: This blog does not guarantee any specific results as a result of the procedures mentioned here and the results may vary from person to person. The topics in these pages including text, graphics, videos and other material contained on this website are for informational purposes only and not to be substituted for professional medical advice.





Post a Comment

0 Comments