Ad Code

మునగ ఆకు ఉపయోగాలు - Amazing Health Benefits Of Drumstick Leaves

మునగ ఆకు ఉపయోగాలు



ఒక కప్పు మునగాకు రసము బాగా వేడిచేసి చల్లార్చి పైపై నీటిని వంచేసి మిగిలిన పదార్ధములో పాలుపోసి కలిపి ఆ మిశ్రమాన్ని గర్భిణీలు గర్భము ధరించిన నాటినుండి తీసుకొనుచున్న పిండము చక్కగా పెరుగుటయే కాక ప్రసవం సౌఖ్యముగా అగును. దీనిలో ఉన్న క్యాల్షియం , ఐరన్ , విటమిన్స్ బిడ్డ ఎదుగుదలకు ఎంతో ఉపయోగపడును. కేవలం గర్భిణీ స్త్రీలు మాత్రమే కాకుండా అన్ని వయసులవారు స్త్రీపురుష బేధము లేకుండా టానిక్ లాగా వాడుకొనవచ్చు. ఈ మిశ్రమాన్ని బాలింతలకు ఇచ్చిన సమృద్దిగా పాలు ఉత్పత్తి అగును. ప్రసవానంతరం త్వరగా కోలుకుంటారు.

బాగా మరిగించి చల్లార్చిన మునగాకు రసం ఒక చెంచా మోతాదులో తీసుకుని ఒక గ్లాసు క్యారెట్ జ్యూస్ నందు కలుపుకుని తాగిన మూత్రవిసర్జనలో మంట , కొన్ని మూత్రపిండాల వ్యాధులు , మలబద్దకం తగ్గును.

ఒక చెంచా మునగాకు రసములో కొద్దిగా తేనె కలిపి ప్రతిరోజూ పడుకునే ముందు తాగుచున్న రేచీకటి తగ్గును. ఇంకా ఙ్ఞాపకశక్తి కూడా పెరుగును .

పైన చెప్పిన మిశ్రమము నందు కొంచం నిమ్మరసం కూడా కలిపి తీసుకుంటే తలతిరుగుడు , మొలలు , ఎక్కిళ్లు , అజీర్ణం , తీసుకున్న ఆహారం శరీరానికి ఒంటబట్టకపోవడం వంటి సమస్యలు నివారణ అగును.

మునగాకు రసము నందు నువ్వులనూనె కలిపి నీరంతా ఆవిరి అయ్యేంతవరకు మరగకాచి ఆ మిశ్రమాన్ని గజ్జి , దురద వంటి చర్మవ్యాధులకు పైపూత ముందుగా రాయుచున్న చర్మవ్యాధులు అంతరించును.

మునగాకులను బాగా వేడిచేసి చిన్నచిన్న దెబ్బలకు , బెణుకు నొప్పుల పైన వేసి కట్టు కట్టిన నొప్పుల బాధలు తగ్గును.

మునగాకు రసము లో కొద్దిగా నిమ్మరసం కలిపి ముఖానికి రాసుకున్న ముఖము పైన మొటిమలు నశించి ముఖచర్మం మృదువుగా అగును.

ఒకస్పూను మునగాకు రసములో 3 మిరియాలు పొడి చేసి కలిపి కణతలు పైన రాసుకున్న తలనొప్పి అంతరించును.

మునగ కాయలు , పచ్చిమామిడి కాయలు కలిపి వండిన కూర తినుచున్న వేసవిలో శరీరానికి చలవ చేకూరటయే గాక మన దేహము నందలి ఐరన్ , విటమిన్ C లోపించకుండా ఉంటాయి.

మునగ పువ్వులను పాలలో వేసి కాగబెట్టి తాగుచున్న తాత్కాలిక నపుంసకత్వం తగ్గును.


ఒక స్పూన్ మునగ పువ్వుల రసమును ఒక గ్లాసు మజ్జిగలో కలిపి తాగుచున్న ఉబ్బసానికి , అజీర్తికి మంచి ఔషధముగా పనిచేయును .

మూత్రపిండాల వ్యాధిలో సంబంధిత మందులతో పాటు లేత కొబ్బరినీటిలో ఒక చెంచా మునగపువ్వుల రసము కలిపి తాగుచున్న మంచి ఫలితాలు కలుగును.


Disclaimer: This blog does not guarantee any specific results as a result of the procedures mentioned here and the results may vary from person to person. The topics in these pages including text, graphics, videos and other material contained on this website are for informational purposes only and not to be substituted for professional medical advice.





Post a Comment

0 Comments