Ad Code

రాగి జావ

రాగి జావ



కాసిని నీళ్లూ, రెండు చెంచాల రాగి పిండి, ఓ బెల్లం ముక్క, ఈ మూడింటితో తయారయ్యే రాగిజావ నిజంగా ఆరోగ్య ప్రదాయినే. ఈ సమయంలో దీన్ని రోజుకోసారి తీసుకోవడం వల్ల పొట్టలో చల్లగా ఉండటంతోపాటు మరెన్నో లాభాలు కూడా ఉన్నాయి. రాగుల్లో క్యాల్షియం పుష్కలంగా ఉంటుంది. దీన్ని ప్రతిరోజూ తీసుకోవడం వల్ల ఎముకలు దృఢంగా ఉంటాయి. వీటిలో ఇనుము మోతాదు కూడా ఎక్కువే. కాబట్టి రక్తహీనతతో బాధపడేవారు తమ ఆహారంలో దీన్ని తరచూ తీసుకోవడం మంచిది. రాగి పిండిలో విటమిన్‌-సి కూడా ఉంటుంది. దీన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరగడం ఒక్కటే కాదు, చర్మం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల రక్తంలో గ్లూకోజ్‌ స్థాయులు అదుపులో ఉంటాయి. బరువు తగ్గాలనుకునేవారికి రాగులను చక్కగా తమ భోజనంలో చేర్చుకోవచ్చు. జావ రూపంలోనే కాదు, ఇలాంటివారు సంగటిగానూ తీసుకోవచ్చు. రాగి పిండిలో పలు రకాల అమైనో ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మనలోని ఒత్తిడీ, ఆందోళనలను తగ్గిస్తాయి. అంతేకాదు కండరాల ఆరోగ్యానికీ, రక్తం తయారవడానికీ, జీవక్రియలు సాఫీగా జరగడానికి తోడ్పడతాయి. దీనిలో మాంసకృత్తులు కూడా మెండుగా ఉంటాయి. కాబట్టి ఈ చిరుధాన్యాన్ని తీసుకోవడం వల్ల పోషకాహార లోపం తలెత్తదు. రక్తంలో కొలెస్ట్రాల్స్‌ను తగ్గిస్తుంది. అలా గుండెజబ్బులు రాకుండా కూడా చూసుకోవచ్చు.

Disclaimer: This blog does not guarantee any specific results as a result of the procedures mentioned here and the results may vary from person to person. The topics in these pages including text, graphics, videos and other material contained on this website are for informational purposes only and not to be substituted for professional medical advice.



Post a Comment

0 Comments