బామ్మ ఉవాచ
ఒరేయ్ అలా మడి ఆచారాలు, శుచి, శుభ్రత లేకుండా ఏమిట్రా, ఆ అప్రాచ్యపు పనులు,
# చెప్పులు ఇంట్లోకి తీసుకు రాకురా
# బయటి నుండి రాగానే కాళ్ళు కడుక్కొరా
# స్తానం చేసిన తరువాత మాత్రమే తిను
# బయట తిరిగి వచ్చిన తరువాత స్థానం చేసి, వేరే బట్టలు వేసుకొని ఇంట్లోకి రా
# ఉతకని బట్టలు కట్టుకోవద్దు
# ఏదైనా తినే ముందు చేతులు కడుక్కో
# ఎవర్ని బడితే వాళ్ళని తాకి, వాళ్ళు ఎంగిలి చేసినది నువ్వుతినకు
# శాఖాహారం మాత్రమే తిను
# కుక్కల్ని, పిల్లుల్ని అలా ఒళ్ళో కూర్చో బెట్టుకొని ముద్దుచేయకు
# బయట వండినవి, నిన్న వండినవి తినకు , వేడిగా ఉన్నప్పుడే తిను
# మడి కట్టుకొని వండు, నేను వంట చేస్తున్నప్పుడు నన్ను ముట్టుకోవద్దు
# పిల్లల్ని నేరుగా ముద్దాడద్దు
# పాత్రలు ఎండలో బోర్లా పెట్టు
# శవాన్ని ముట్టుకోవద్దు , చనిపోయిన వారి కుటుంబ సభ్యులను రెండు వారాలదాకా ముట్టుకోవద్దు, వారితో తిరగవద్దు.
ఒకప్పుడు మన ఇళ్ళల్లో పెద్దలు ఇలా అంటే చాదస్తం అని చిరాకు పడే వాళ్ళం. ఇప్పుడు ప్రపంచం మొత్తానికి చాదస్తం పట్టుకుంది.
0 Comments