Ad Code

గుడిలో పూజారికి దక్షిణ ఇవ్వాలా? - Should we offer dakshina to priest at temples


గుడిలో పూజారికి దక్షిణ ఇవ్వాలా?

మీరు కానుకలు హుండీలోనే వేయండి. పూజారి ప్లేటులో వేయవద్దు ,హుండీలో వేసిన సొమ్ము మాత్రమే భగవంతుడికి చేరుతుంది .అని కొన్ని గుళ్ళలో వ్రాసి వుంటారు.

హుండీ ఎవరు తెరుస్తారు ? ఆ ఆలయ కార్యనిర్వాహణాధికారి ! ఆయనెవరు ? ప్రభుత్వప్రతినిధి!

అంటే భక్తుడు ప్రభుత్వముద్వారా తన సొమ్మును దేవుడికి పంపుతున్నాడన్నమాట!
సరే! మరి పూజారి ఎవరు?

పొద్దున్నే తెల్లవారుఝామునే లేచి భగవంతుడికి మేలుకొలుపులు పాడి ! (దేవుడికంటే ముందే మేలుకొంటున్నాడన్నమాట!)

ఆయనకు అభిషేకాలు చేసి దర్శనానికి వచ్చే భక్తులమదిలో ఒక లౌకికపవిత్రభావనకలిగేటట్లు అలంకారాలు పూర్తిచేసి ఆయనను అష్టోత్తరాలు, సహస్రాలతో పొగిడి, స్వామీ! నీ దర్శనానికి వచ్చే భక్తుల అభీష్టాలు నెరవేర్చు తండ్రీ అని చెప్పి వచ్చిన భక్తులకు భగవంతుడి ఆశీర్వాదాలు అందజేసే భగవంతుడి బంట్రోతు మరి ఆయన జీతమెంత? చాలాచాలా తక్కువ.

బ్రతుకు జట్కాబండి ఈడ్వలేనంత పూజారా మేము పిల్లనివ్వం అంటూ బ్రతుకు అపహాస్యం అవుతుంటే భగవంతుడి సేవ వదులుకోలేక చావలేక బ్రతుకుతున్న పూజారులెందరో...

కట్టుకున్నదానికి కన్నపిల్లలకు న్యాయం చేయలేక బ్రతుకీడుస్తున్న వారు ఎందరో కోకొల్లలు వారిపట్ల మనకు ఏ బాధ్యతాలేదా? మన కుటుంబాలు కార్లలో తిరగాలి మన కుటుంబీకులు ఖరీదయిన దుస్తులు వేసుకోవాలి విహారయాత్రలకు వెళ్ళాలి అందుకు సంపాదన కావాలి ఆ సంపాదన ఇబ్బడిముబ్బడిగా పెరగడం కోసం దేవుడి పూజలు చేస్తాం ఆ దేవుడికి కమీషన్లు ఇస్తాం కానీ ఆ పూజలు చేసే పూజారి బ్రతుకు మాత్రం పట్టించుకోము ఇదెక్కడి న్యాయం నా విన్నపం ఏమిటంటే హుండీలో వేసినా వేయకపోయినా పూజారి ప్లేటులో మాత్రం కానుక వెయ్యండి కానుక వేయకుండా అతడి కడుపు మాడిస్తే మీరు నమ్మిన దేవుడికి మీ కోరికలు తెలియచేస్తూ పూజలు చేసేవారు భవిష్యత్తులో దొరకరు ఉదాత్తానుదాత్తస్వరాలతో భగవంతుడిని స్తుతించే పండితుడు చేసే పూజలు అరుదుగా చూస్తున్నాం, ఆ వృత్తిలో ఆదాయం వస్తే మేధావులు వస్తారు సలక్షణంగా పూజలు జరుగుతాయి, మన సంస్కృతిని నిలబెట్టుకోవడమా, పడగొట్టడమా, ఆలోచించండి.



Post a Comment

0 Comments