Ad Code

అహోబిలం నవ నారసింహక్షేత్రం - Ahobilam Nava Narasimha (Lakshmi Narasimha Swamy) Temple



అహోబిలం నవ నారసింహక్షేత్రం



దట్టమైన అడవి, క్రూర మృగాలకు ఆలవాలంగా అహోబిలం ఉంది. అహోబిలంలో నరసింహ స్వామి కొలువై యున్నాడు. ఈ అహోబిల్ పుణ్యక్షేత్రానికి "సింగవేల్ కుండ్రం" అను పేరిట పిలుస్తారు. ఈ క్షేత్రం హిరణ్యకశిపుని సంహరించిన నరసింహస్వామి పేరిట వెలిసింది. ఇక్కడ నరసింహస్వామి తొమ్మిది రూపాలలో కనిపిస్తాడు కనుక ఈ క్షేత్రానికి "నవ నరసింహ క్షేత్రం" అనే మరో పేరు కూడా ఉంది.

అహోబిల నరసింహస్వామి, వరాహ నరసింహస్వామి, మలోల నరసింహస్వామి, యోగానంద నరసింహస్వామి, భావనా నరసింహస్వామి, కారంజ నరసింహస్వామి, ఛత్ర వడ నరసింహస్వామి, భార్గవ నరసింహస్వామి, జ్వాలానరసింహస్వామిగా నవ నరసింహుడిగా స్వామి భక్తుల పాలిట కొంగుబంగారమై భాసిల్లుతున్నాడు.

ఎగువ అహోబిలం మరియు దిగువ అహోబిలం అనబడే రెండు పర్వతాలను ఈ క్షేత్రం కలిగి ఉంది. ఎగువ అహోబిలం చేరుకోవాలంటే దిగువ అహోబిలం నుంచి ఆరు కి.మీల బస్సు ప్రయాణం చేయాలి. ఈ క్షేత్రంలోని దేవుడు తొమ్మిది విగ్రహ రూపాలలో కనిపిస్తాడు. నవగ్రహాల కన్నా నవ నరసింహుని శక్తి అధికమని భక్తుల విశ్వాసం.

ఈ ఆలయంలో భారీ నిధులున్నాయి ప్రచారం జరుగుతోంది. శ్రీకృష్ణదేవరాయలు ఈ నిధులను ఆలయంలోని సురక్షిత ప్రాంతంలో దాచి తాను కూడా జీవ సమాధి అయినట్లు భక్తులు, స్థానికులు చెబుతున్నారు. ఈ నిధులను అహోబిల స్వామి క్రూరమృగాలు, పాములు, తేనెటీగల రూపంలో రక్షిస్తున్నాడని భక్తుల విశ్వాసం.

తిరువనంతపురం పద్మనాభ స్వామి ఆలయం తరహాలోనే అహోబిల స్వామి ఆలయంలోనూ భారీ నిధులు ఉంటాయని, అందుకే అహోబిలుడు "ఆంధ్రా పద్మనాభుడు" భారీ నిధులను కలిగివున్నాడని పండితులు చెబుతున్నారు.




అహోబల క్షేత్రములో నవనారసింహమై తొమ్మిదిమంది నరసింహులుగా ఉన్నాడు.

1. జ్వాలానరసింహుడు: ఆయనే ఉగ్ర నరసింహ స్వరూపము. మొదటగా వచ్చిన తేజో స్వరూపము. హిరణ్యకశిపుని పొట్ట చీలుస్తున్న స్వరూపములో ఉంటాడు.

2. అహోబలనరసింహస్వరూపము: హిరణ్యకశిపుని సంహరించిన తరవాత కూర్చున్న స్వరూపము.

3. మాలోల నరసింహుడు: లక్ష్మీదేవి చెంచు లక్ష్మిగా వస్తే ఆమెని స్వీకరించి ఎడమ తొడ మీద కూర్చో పెట్టుకున్న స్వరూపము.

4. కరంజ నరసింహుడు అని నాలగవ నరసింహుడు. ఆయన చెట్టుకింద ధ్యాన ముద్రలో ఉంటాడు.

5. పావన నరసింహుడు: ఆయన దగ్గరకు వెళ్ళి ఒక్కసారి నమస్కారము చేస్తే ఎన్ని పాపములనైనా తీసేస్తాడు. మంగళములను ఇస్తాడు. అందుకని ఆయనని పావన నరసింహుడు అనిపిలుస్తారు.

6. యోగ నరసింహుడు అంటారు. అయ్యప్పస్వామి ఎలా కూర్చుంటారో అలా యోగపట్టముకట్టుకుని యోగముద్రలో కూర్చుంటాడు. ఇప్పటికి అక్కడకి దేవతలు కూడా వచ్చి ధ్యానము చేస్తారు అని చెపుతారు.

7. చత్రవట నరసింహస్వరుపము అంటారు. పెద్ద రావి చెట్టుకింద వీరాసనము వేసుకుని కూర్చుంటాడు. అక్కడకి హూ హ, హా హా అని ఇద్దరు గంధర్వులు శాపవిమోచనము కొరకు నరసింహస్వామి వద్దకి వచ్చి పాటలు పాడి నృత్యము చేసారు. ఆయన తొడమీద చెయ్యి వేసుకుని తాళము వేస్తూ కూర్చున్నారు. ఆ కూర్చున్న స్వరూపమును చత్రవట నరసింహస్వరూపము అంటారు అక్కడకు వెళ్ళి కొంతమంది పెద్దలు సంగీతము పాడుతుంటారు.

8. భార్గవ నరసింహుడు పరశురాముడు నరసింహ దర్శనము చెయ్యాలని కోరుకుంటే అనుగ్రహించి దర్శనము ఇచ్చిన స్వరూపము

9. వరాహ నరసింహస్వరూపము భూమిని తన దంష్ట్రమీద పెట్టుకుని పైకి ఎత్తినటువంటి స్వరూపము ఆదివరాహస్వామి పక్కన వెలసిన నరసింహస్వరూపము మొదటగా వచ్చిన యజ్ఞ వరాహస్వరూపము, నరసింహ స్వరూపము రెండు ఉంటాయి వరాహ నరసింహము. తొమ్మిది నరసింహస్వరూపములు అహోబలక్షేత్రములో ఉంటాయి.

అహో అంటే ఒక గొప్ప ప్రశంస. బిలం అంటే బలం అని చెపుతారు. కనుక అహోబిలం అంటే గొప్పదైన బలం అని చెప్పాలి. పురాణాల మేరకు శ్రీమహావిష్ణువు రాక్షసుల రాజైన హిరణ్యకశికుడ్నిసంహరించేందుకు సగం మనిషిగానూ, సగం సింహ రూపంలోనూ అవతరించినది ఈ ప్రదేశంలోనే అని చెబుతారు. విష్ణువు యొక్క ఈ భయంకరమైన రూపంచూసిన సకలదేవతలు ఆయన గురించి అహో! ఎంత బలవంతుడు అని కీర్తించినారట.

జయజయ ధ్వానాలు చేసారట.అందుకనే ఈ ప్రదేశానికి కాలక్రమేణా అహోబిలం, అహోబలం అని పేరొచ్చింది. ప్రస్తుతం అహోబిలం క్షేత్రం సీమాంధ్రలోని కర్నూలు జిల్లాలో ఆళ్లగడ్డమండలంలో కలదు.

ఈ పుణ్యక్షేత్రానికి వెళ్ళాలంటే కర్నూలు,నంద్యాల మరియు హైదరాబాద్ నగరాలనుండి బస్సులు లభిస్తాయి. ఈ ప్రదేశానికి రైలుమార్గం లేదు.సమీప రైలుస్టేషన్ నంద్యాలలో వుంది. ఇది బెంగుళూర్,వైజాగ్ రైలుమార్గంలో తగులుతుంది.

పురాణ గాథ:
ఒక పురాణ గాథమేరకు ఈ పుణ్య ప్రదేశంలో విష్ణుమూర్తి అవతారమైన నరసింహస్వామి రాక్షసుల రాజైన హిరణ్యకశికుడ్ని వధించి అతని కుమారుడైన ప్రహ్లాదుడ్ని ఆశీర్వదించాడు. అహోబలం హిందూ యాత్రికులకే కాక, పర్యాటక కేంద్రంగా, కొండలు, నదులు, ప్రకృతి అలంకారాలకు నైసర్గిక స్వరూపాలు. ఇది ముఖ్యంగా వైష్ణవ యాత్రికులకు పవిత్ర పుణ్యక్షేత్రం. పురాణ ప్రసిద్ధిగాంచిన అహోబిలాన్ని అహోబలం అని కూడా వ్యవహరిస్తారు
నరసింహుడి బలాన్ని, శక్తిని దేవతలు ప్రశంశించడం వల్ల అహోబలమైనది. ఎగువ మహోబలంలో ప్రహ్లాదుని తపస్సుకు మెచ్చి స్వయంభువుగా బిలంలో వెలిసినాడు కావున అహోబిలం అని కూడా పిలుస్తారు. నరహరి తన అవతారాన్ని భక్తుల కోసం తొమ్మిది ప్రదేశాలలో ప్రకటించాడు కావున నవనారసింహక్షేత్రం అని అంటారు.

నవనారసింహులలో దిగువ అహోబిలంలో పేర్కొనబడలేదు. కాని ఈ ఆలయప్రాశస్తం అమోఘమైనది. ఇక్కడికి వచ్చిన భక్తులు ఎగువ దిగువ అహోబల పుణ్యక్షేత్రాలను సందర్శించి తరిస్తారు. ఈ క్షేత్రం కర్నూలు జిల్లాలోని నంద్యాల రైల్వేస్టేషన్ కు 68 కిలోమీటర్ల దూరంలోని ఆళ్ళగడ్డకు 24 కిలోమీటర్ల దూరములో ఉంది.

అన్ని ప్రధాన క్షేత్రముల నుండి అహోబిలం చేరడానికి మార్గాలు, రవాణా సౌకర్యములున్నవి. ఈ క్షేత్రం సముద్రమట్టమునకు 2800 అడుగుల ఎత్తులో ఉంది. అహోబలంలో ప్రదానమయినది భవనాశిని నది. లక్ష్మినరసింహుని పద సరసజములు కడిగే పాద్యంగా గగన గంగ భువికి దిగి వచ్చింది. ఈ దివ్య తీర్థంలో స్వయంభువుగా వెలసిన దేవదేవుడు ఉగ్రనరసింహస్వామి.

శ్రీ కార్యపరుల పరమ భక్తుల ఏకాంత భక్తికి అమృతవల్లి సమేత నరసింహుడు పరవసించి సేవింపవచ్చిన వారికి కోరకనే వరాలు అనుగ్రహిస్తాడు. ప్రహ్లాద వరదుడు లక్ష్మీ సమేతుడై సుందరంగా శేషపీఠం మీద అవతరించాడు. వీరి సహితంగా అమృతవల్లి సన్నిధి అండాల్ సన్నిధి ఉన్నాయి.

ఇక్కడ వైష్ణవ ఆచార్యులకు, అళ్వారులకు ప్రత్యేక సన్నిధాలున్నవి. వేంకటేశ్వరునకు పద్మావతి వివాహ సమయమున శ్రీ నరసింహస్వామిని ప్రతిష్ఠించి ఆరాధించాడు కావున ఈ ఐదిక్యానికి గుర్తుగా వెంకటేశ్వరుని సన్నిధి, కళ్యాణ మంటపం ఉంది. ప్రహ్లాద వరదుడు ఉభయనాంచారులయిన శ్రీదేవి, భూదేవి విగ్రహాలు స్వర్ణ కవచాలతో మూలమూర్తులకు దివ్యాభిషేకాలతో, దివ్య ఆభరణములతో నేత్ర పర్వంగా నిలిచింది.

ఈ క్షేత్రం 108 దివ్య క్షేత్రములలో ప్రముఖమైనది. వైష్ణవ ఆళ్వారులు దర్శించి స్తుతించిన క్షేత్రమును మాత్రమే దివ్యక్షేత్రములు అంటారు. ఈ క్షేత్రం నల్లమల అడవులలో ఉంది. ఆదిశేషుడు పర్వతాకృతి పొందినాడని పౌరాణిక విశ్వసం ఈ పర్వత ప్రకృతి సౌందర్యానికి మురిసిపోయిన ఆదిశేషుడు వయ్యారంగా పవళించారు. ఆ పడగలపై శ్రీనివాసుడు, నడుముపై నారసింహుడు, తోకపై మల్లిఖార్జునుడు ఆవిర్భవించారు. వీరు నల్లమల మగసిరులుగా మలచారు.

తిరుమల, అహోబిలం, శ్రీశైలం స్వయం వ్యక్త క్షేత్రాలు. అహోబిలక్షేత్ర ప్రసిద్ధికి, అభివృద్ధికి ఎందురో రాజులు, రాజన్యులు, ఎన్నో సేవలందించారు. పల్లవులు, చోళులు, విద్యానగరరాజులు, చాళుక్యులు, కాకతీయులు, విజయనగరరాజులు, రెడ్డిరాజులు అభివృద్ధికి వికాసానికి తోడ్పడినారు. 15వ శతాబ్దంలో తురుష్కుల దండయాత్రలో అహోబిలక్షేత్రం పడి నలిగిపోయింది.

రంగరాయల ప్రభువు తురుష్కుల మీద విజయం సాధించి జీయరుగారికి అహోబిలక్షేత్రాన్ని అప్పగించి, జయానికి గుర్తుగా ఉన్నతోన్నత మయిన జయస్తంభాన్ని దేవాలయ చివరి ప్రాకారమందు స్థాపించాడు. ఇది ఇప్పటికి మనం చూడవచ్చు.

పరమశివ భక్తుడయిన ప్రతాప రుద్రమహారాజు దినచర్య ప్రకారం శివలింగం పోతపోయగా నృసింహాకృతి వచ్చినందుకు ఆ విగ్రహాన్ని మొదటి అహోబిల పీఠాధిపతి వారికి అప్పగించి, జీవితాంతం నరసింహుని సేవించి పూజించాడు. ఈ క్షేత్రానికి నగరి, నిధి, తక్ష్యాద్రి, గరుడాద్రి, శింగవేళ్ కుండ్రం, ఎగువ తిరుపతి, పెద అహోబిలం, భార్గవతీర్థం, నవనారసింహ క్షేత్రం అనే పేర్లు కూడా కలవని పురాణములు చెప్పుచున్నవి.

తురుష్కుల దండయాత్రలో విచ్ఛిన్నమయిన అహోబల్ క్షేత్రానికి 43వ పీఠాధిపతి పంచసంస్కారాలలో 44వ పీఠాధిపతి ఆశీస్సులతో మధురాంతకం నుండి అహోబలం మేనేజర్ గా నియమితులయిన ఆర్. లక్ష్మినారాయణ కాలమునుండి పూర్వవైభవాన్ని సంతరించుకుంటూ వస్తున్నది.
ఇతను వేద, ప్రభంధము, అధ్యయనము, మూర్తులకు అలంకారము చేయడంలో నిష్ణాతులు. ఎన్నో ఉత్సవాలను భక్తుల సహాయంతో పూర్వ వైభవాన్ని సంతరించుకునేటట్లు చేశారు. అదే క్రమంగా పూర్వ వైభవాన్ని సంతరించుకుంటున్నది. అహోబిల నృసింహుని సుప్రభాత సుందర సేవలు, ఏకాంత సేవల వరకు సొగసులను నింపుకున్నది.

నవరాత్రులు విశేష దినములలో అయ్యవారు, అమ్మవారు, అద్దాల మంటపంలో వింత వెలుగులు విరజిమ్ముతున్నారు. విజయదశమి, సంక్రాంతి పార్వేట ఉత్సవాలలో స్థానికులు, చెంచుల విన్యాసాలు, విల్లంబుల ప్రయోగాలు గ్రామీణ వాతావరణానికి అద్ధం పడతాయి.

ఆలయ విధులలో పూజ పునస్కారములలో తెలిసో తెలియకో జరిగిన శైతిల్యాలకు ప్రాయశ్చిత్తంగా, వర్చస్వంతంగా క్షేత్రం విరాజిల్లడానికి పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. ఎన్నో నిత్య సేవలు, ఆర్జిత సేవలు, ఉత్సవాలు, అభిషేకాలు, వేదాంత ఘోషలు, ప్రభంధ పారాయణములు, కళ్యాణోత్సవములు, ఆలయపాలకులు అనితరసాధ్యంగా నిర్వహిస్తారు.

తీర్థయాత్రలలో ప్రధానమయిన మండపం (తలనీలాలు), స్నానం దర్శనం మొదలయిన వాటికిక్కడ అవకాశమేర్పడింది. దిగువ అహోబిలం చేరుకుని, ప్రహ్లాదవరదుని సేవించుకొని ఇక్కడికి 8 కి.మీ దూరములోనున్న ఎగువ అహోబిలంలోని గుహాంతర్భాగాన నిలిచిన అహోబల నృసింహుని అర్చించుకొని భవనాశిని జలాలతో సేద తీర్చుకొని ఓర్పుతో క్రమంగా నవనారసింహ క్షేత్రాలను దర్శించుకొని ప్రహ్లాద బడిలో బండ మీద నిలిచి భాగవత సుందర జ్ఞాపకాలను పొంది ఉగ్రస్తంభ ప్రదక్షిణలతో పుణీతమై తీర్ధయాత్రను ఫలవంతం చేసుకోవడానికి నేడు చక్కని అవకాశమున్నది.

చరిత్ర:
ఈ క్షేత్రాన్ని 1830ల్లో కాశీయాత్రచేసి దానిని గ్రంథస్థం చేసిన యాత్రాచరిత్రకారుడు ఏనుగుల వీరాస్వామయ్య తన కాశీయాత్రా చరిత్రలో వర్ణించారు. ఆయన వ్రాసిన ప్రకారం 1830 నాటికి ఎగువ అహోబిలానికి, దిగువ అహోబిలానికి నడుమ చీకటిగల అడవి ఉండేది. అప్పటికి ఈ స్థలం కుంభకోణం వద్దనుండే అహోబళం జియ్యరు వారి ఆధీనం. వారి ముద్రకర్త అహోబిలానికి రెండు క్రోసుల దూరానగల బాచపల్లెలో ఉండి ఈ స్థలాన్ని చూసుకునేవారు.

ముద్రకర్త యెగువ, దిగువ స్థలాల్లో అర్చన చేసే అర్చకులిద్దరికీ అప్పుడప్పుడూ నెలకు రూ.6 చొప్పున జీతం ఇస్తూవుండేవారు. గుడి ఖర్చులకు జియ్యరు పంపే డబ్బు తప్ప మరే దారీ ఉండేది కాదు. హైదరాబాద్ రాజ్యపు దివాను పేష్కరు రాజా చందులాలా ఈ క్షేత్రానికి సంవత్సరానికి రూ. వెయ్యి చొప్పున ఇప్పించేవారు. దిగువ అహోబిలంలో కొన్ని పేదల గుడిసెలు ఉండేవని, ఎగువన అవీ లేవని, జలము రోగప్రదం కావడంతో మనుష్యులు నివసించేందుకు భయపడేవారని వ్రాశారు.

ఫాల్గుణమాసంలో బ్రహ్మోత్సవాలు జరిగే రోజుల్లో 400 వరహాల హాశ్శీలు ఆదాయం వస్తూండేదని, దానిని కందనూరి నవాబు తీసుకుని గుడికి చేయాల్సిన సౌకర్యాల గురించి మాత్రం పట్టించుకునేవాడు కాదని వివరించారు. ఉప్పుతో సహా ఏమీ దొరకని ప్రాంతంగా ఉండేది. ఏవి కావాల్సినా బాచపల్లె నుంచి తెచ్చుకోవాల్సి వచ్చేది. అక్కడ ప్రతిఫలించియున్న పరమాత్మ చైతన్యము, స్వప్రకాశము చేత లోకులకు భక్తిని కలగజేయుచున్నది గాని, అక్కడ నడిచే యుపచారములు దానికి నేపాటికిన్నీ సహకారిగా నుండలేదు. అని ఆయన వ్రాశారు.

అహోబల మహత్యం:
ఈ పుడమి మీద ఉన్న నాలుగు దివ్యమైన నరసింహ క్షేత్రాలలో అహోబిల క్షేత్రం ఒకటి. రాక్షసుడైన హిరణ్యకశ్యపుని సంహరించడానికి తన భక్తుడైన ప్రహ్లాదుని రక్షించడానికి స్తంభమునందు, ఉద్భవించిన స్థలమే ఈ అహోబిలక్షేత్రము. ఈ స్థల పురాణం గురించి వ్యాస మహర్షి సంస్కృతంలో బ్రహ్మాండపురాణం అంతర్గతంలో 10 అధ్యాయాలు, 1046 శ్లోకములతో అహోబిలం గురించి వ్రాయబడింది.

అహోబిల స్వామి వారు తన పెళ్ళికి తానే స్వయంగా భక్తులను అహ్వాఇస్తానని అన్నారట. ఆరు వందల సంవత్సరాల క్రితం ఆ నాటి ప్రప్రథమ పీఠధి పతి శ్రీ శఠ గోప యతీంద్ర మహదేశికన్ వారు ఈ బ్రహోత్సవానికి శ్రీకారం చుట్టారు. ఆ నాటి నుండి ఈ నాటివరకు పర్వేట ఉత్సవాలు ఘనంగా 45 రోజుల పాటు జరగడం ఒక విశేషము.

తిరుమలలో కూడా శ్రీ వారికి పార్వేట ఉత్సవాలు జరుగుతాయి. అటు పిమ్మట బ్రంహ్మోత్సవాలు జరిగిగరుడోత్సవంతో అనగా మర్చి 17 న ఈ వేడుకలు పూర్తవుతాయి. అహోబిల స్వామి వారుతన వివాహ మహోత్సవానికి భక్తులను ఆహ్వానించడానికి అహోబిల పరిసర ప్రాంతంలో సుమారు 35 గ్రామాల్లో ఈ నలబైదు రోజులు సంచరిస్తాడు.

పర్వేట ఉత్సవాలు ఈ గ్రామాలలో ఆ నలబైదు రోజులు జరుగుతాయి. ఈ నెలన్నర రోజులు అన్ని గ్రామాల్లో అందరికి పండగే. అన్ని వేడుకలె. స్వామి వారి పల్లకి మోసే బాధ్యత ఇక్కడి కొన్ని కుటుంబల వారికి తరతరాలుగా వంశ పారంపర్యంగా వస్తున్న ఒక సంప్రదాయము. సుమారు 120 మంది ఈ విధంగా స్వామి వారి సేవలో తరిస్తున్నారు.

ఎగువ అహోబలము:
ఎగువ అహోబిలంలో వేంచేసియున్న మూల విరాట్ కు ఉగ్రనరసింహస్వామి అహోబిల, అహోబల, నరసింహస్వామి, ఓబులేసుడు అని పిలుస్తారు. గరుడాద్రి, వేదాద్రి పర్వతముల మధ్యన ఈ ఎగువ అహోబిల ఆలయము ఉంది.

దిగువ అహోబలము:
శ్రీ వేంకటేశ్వర స్వామి ప్రతిష్ఠించిన లక్ష్మీనరసింహస్వామి వేంచేసినదే దిగువ అహోబిలం.

వసతి సౌకర్యాలు:
అహోబిలంలో వసతి సౌకర్యములు ఇంకా సరిగ్గా లేవు. వసతి కోసం మూడు అవకాశములు ఉన్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానము వారి అతిథి గృహములో ఉండవచ్చు లేదా అహోబిలం మఠంలో ఉండవచ్చు. దగ్గరలోని పట్టణం, ఆళ్ళగడ్డలో ఉండవచ్చు. అది 30 కి.మీ దూరంలో ఉంది లేదా 70 కి.మీ దూరంలో వున్న నంద్యాలలో వుండవచ్చు. ఇక్కడ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ పర్యాటకం వారి భోజన హోటల్ ఉంది.

ఎలా చేరాలి:
చెన్నై-బొంబాయి రైల్వేమార్గములో గల కడప స్టేషన్‌లోదిగి అక్కడ నుండి బస్‌లో 90 కి.మీ.దూరంలోని ఆళ్లగడ్డ" అనే చోటదిగి అక్కడ నుండి వేరుబస్‌లో 25 కి.మీ. దూరంలో ఈ క్షేత్రము చేరవచ్చును. నంద్యాల నుండి 45 కి.మీ. బస్ సౌకర్యం ఉంది. అన్నివసతులు ఉన్నాయి.

రోడ్డు మార్గము:
హైదరాబాదు నుండి అహోబిలం వెళ్ళేందుకు రోడ్డు సౌకర్యం ఉంది.కడప. తిరుపతి నుండి వచ్చువారు, చాగలమర్రి నుంచి ముత్యాలపాడు, క్రిశ్నాపురం, బాచేపల్లి మీదుగ కూడా అహోబిలం చేరుకోవచ్చు.

రైలు మార్గము:
అహోబిలం దగ్గరలోని రైలు సముదాయము నంద్యాల అక్కడి నుండి బస్సులు, కార్లలో వెళ్ళవచ్చు.

విమాన మార్గము:
అహోబిలం దగ్గరలోని విమానాశ్రయం కర్నూలు నంద్యాల మార్గమధ్యంలో ఉన్న ఓర్వకల్లు ఇది మొదలైతే అక్కడి నుంచి బస్సులు, కార్ల ద్వారా వెళ్ళడానికి ఉంటుంది. మరొకటి హైదరాబాదు, అక్కడనుండి మీరు రోడ్డు మార్గం ద్వారా వెళ్ళవచ్చు.

తీర్థై రింద్ర సుపావనాశ నరసింహాఖ్యానకై రంచితే
లక్ష్మీం ప్రాస్య గుహం విమాన ముపయన్ శ్రీ నారసింహో హరి:
దివ్యేహోబిల పట్టణే విజయతే ప్రాచీ దిశాస్యాననో
ప్రహ్లాదాక్షి పదం గత: కలిరిపు శ్శ్రీమచ్చఠారి స్తుత:


PrahladaVarada Narasimha

At the foot of hills, there is a temple of Prahladavarada Narasimha i.e, the aspect of Lord Narasimha as blessing Prahlada. This temple was built in Vijayanagar style.

Chatravata Narasimha
The deity is installed under a pipal tree which is surrounded by thorny bushes.

From the foot of the hills, one has to ascend up the hill to reach Upper Ahobilam. This path is of 10.5 km where several shrines of Narasimha are installed here.

Karanda Narasimha, Yogananda Narasimha
There is a Shrine of Karanda Narasimha and another called Yogananda Narasimha. As per the Legends, that after killing the demon HiranyaKasyapa, Lord Narasimha taught  Prahlada several yogic postures and the Lord in this aspect is called Yogananda Narasimha. It is said that the Sages Gobhila and Bharadwaja performed penance to get rid of the sins that they had committed.

The two crests of the hills are called by Vedadri and Garudadri. The Tirtham divides into two and joins Kumadavati and Penna. The Tirtham is said to be an Antarvahini i.e. a river which flows inside during part of its course.

Ugra Narasimha
In the southern slope of the hill, the Lord is worshipped in his fierce form Ugra Narasimha. Near to this shrine is the shrine of Guha Narasimha, at the entrance of which is a huge pillar (Ugra Sthambha). It is believed that it is the Pillar which Hiranyakasyapa hit with mace asking his son whether Lord Vishnu was immanent in that pillar too was this same pillar, and that out of this pillar, Lord Vishnu finally emerged out in his ferocious form Ugra Narasimha and killed the demon.

Kroda Narasimha
Moving further will take us to Kroda Narasimha, where the Lord is worshipped in the form of a boar. It is said that if one does Narayana Satakshari Japa and Parayana of Varahakanda at this place will be blessed with immense spiritual consciousness.

Malola Narasimha
Little further up the hill will lead us to Malola Narasimha. The deity here is Santaroopa, always in the sport with the divine mother Lakshmi. The Kakatiya King Prataparudra has donated the Utsava deity made of gold which is under worship by the Ahobilam Jeeyars.

Jwala Narasimha
Moving up the hill, there located a shrine for Jwala Narasimha, where the Ugrakala of the Lord is seen, and it is said that this is the actual spot where the fierce anger of the Lord reached its climax when he tore asunder Hiranyakasyapa

Pavana Narasimha
Nearby, is the Pavana Narasimha, where worship in the Shakta form of the worship of the Lord is said to be done .

The Lord in the Upper Ahobilam is said to be Swyambhu i.e self-manifested. There are two popular legends for the derivation of the word Ahobilam. It is said that the Devas while witnessing the ferocious form of the Lord and the terrific aspect he took on in order to tear to pieces Hiranyakasyapa sang in his praise

‘Narasimha Paramam Devam Aho Balam Aho Balam’

and hence, the place has come to be known as Ahobilam.

Another version is that because of the great cave, the Ahobila, where Garuda worshipped and realised the Lord. The place itself is come to be called Ahobila.

Ahobilam Temple Timings:
Lower Ahobilam (Diguva Ahobilam)

Morning Hours: 6:30 am – 1:00 pm.
Evening Hours: 3:00 pm – 8:00 pm
Upper Ahobilam (Eguva Ahobilam)

Morning Hours: 7:00 am – 1:00 pm
Evening Hours: 2:00 pm – 7:00 pm
How to reach Ahobilam Temple?
By Air:
The nearest airport is at Tirupati which is 229 km away.
Hyderabad International Airport is at 333 km away.

By Train:
The nearest railway station is at Prodattur which is 60 km away
Jammalamadugu Railway Station is 55 km away

By Road:

Direct bus to Ahobilam is available from Kadapa, Kurnool districts.



Post a Comment

0 Comments