Ad Code

కైలాస పర్వత విశేషాలు - Mount Kailash Story


కైలాస పర్వత విశేషాలు


కైలాస పర్వతం అంటే మౌంట్ కైలాష్. ఇది టిబెట్ భూభాగంలో వున్న హిమాలయ పర్వత శ్రేణుల్లో సముద్రమట్టానికి 6.638 మీటర్ల ఎత్తులో వుంది. ఈ పర్వతం నాలుగు మతాలలో పవిత్ర స్థలంగా భావించబడుతుంది. అవి బోన్, బుద్ధిజం, హిందూమతం, జైనిజం. హిమాలయాల్లో వున్న అనేక పర్వతాలలో కంటే ఈ కైలాస పర్వతానికే ఎన్నో విశిష్టతలు వున్నాయి. సమస్త మానవాళికి అర్థంకాని రహస్యాలు ఇక్కడెన్నో వున్నాయి. హిందూమతం ప్రకారం శివుడు, పార్వతీ సమేతుడై ఇక్కడే కొలువై వున్నాడని పురాణాలలో కొన్ని కథలు కూడా వున్నాయి.

మొత్తం ఆసియాలోనే పొడవైన నదులుగా పేరుగాంచిన బ్రహ్మపుత్ర, సింధూ, సట్లజ్, గంగానదికి ఉపనది అయిన కర్నాలి మొదలైన నదుల మూలాలు ఈ పర్వత ప్రాంతంలోనే వున్నాయి. కైలాస పర్వతం నలువైపులా నాలుగు రూపాల్లో కనిపిస్తూ.. నాలుగు రంగుల్లో దర్శనమిస్తుంటుంది.

హిందూ మతప్రకారం.. శివుడు ఈ కైలాస పర్వత శిఖరంలో నివసిస్తున్నాడు. పార్వతీ సమేతుడై నిరంతరం ధ్యాన పరిస్థితిలో వుంటాడు. విష్ణుపురాణం ప్రకారం కైలాస పర్వత నాలుగు ముఖాలు స్ఫటిక, బంగారం, రుబి, నీలం రాయితో రూపొందించినట్లు తెలుపబడింది. ప్రపంచానికి పునాది వంటిది. తామరు పువ్వు ఆకారంలో వున్న ఆరు పర్వతాల మధ్య ఈ కైలాస పర్వతం ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తుంది. 


Mount Kailash
The Kailash Range is 30 million years old and its supreme peak, the 6,638 meter high Mount Kailash was formed of shining granite with its white glacial crest, was already a huge, structure even when the Himalayas were just beginning to protrude out of the Tethys Sea. Hindus and Tibetans seem to have been aware of the uniqueness of this mountain from the most ancient times. To Hindus it is the earthy embodiment of the dominant mountain of heaven, Meru, and the residence of Lord Shiva and his consort Goddess Parvati.

As might have been expected, most of the Himalayan passes in Kumaun and Garhwal provide access to this sacred mountain. Today, however, pilgrims from India are allowed to journey to Mount Kailash only through the Lipulekh pass in Kumaun. Moreover, the pilgrimage to Kailash, and to the sacred Mansarover lake that lies 30 Km to its south, is run exclusively by a government organization, the Kumaon Mandal Vikas Nigam (KMVN). The organization works in collaboration with the Government of India’s Ministry of External Affairs, and the Government of China. Kailash – Mansarovar lies in Chinese-occupied Tibet.

State: Uttarakhand
Famous for/as: Pilgrim
Languages: Tibetan, Hindi and English
Best Season: May – Oct
Weather: Summer 15 to 30°C,
Winter: -5 to 24°C
Altitude: 5750 m





Post a Comment

0 Comments