పూజా విధానం:
నరక చతుర్దశినాడు ఉదయాన్నే లేచి మువ్వులనూనెను తలపై రాసుకొని, అభిషేక స్నానం చేసుకోవాలి. ఆ సమయంలో ప్రత్యేకించి మువ్వులనూనెలో లక్ష్మి, మంచినీటిలో గంగాదేవి కొలువై వుంటారని శాస్త్రాలలో వివరించబడి వున్నాయి.
స్నానం చేసుకున్న తరువాత ‘‘యమాయయ: తర్పయామి’’ అంటూ నువ్వులతో యమునికి మూడుసార్లు తర్పణం ఇవ్వడం ప్రాచీనకాలం నుండి ఆచారంగా వస్తోంది.
యముడిని పూజించుకున్న తరువాత మినుములతో చేసిన పదార్థాలు తినడంతోపాటు సూర్యాస్తమయం తర్వాత ముంగిట్లో, పడకగదిలో దీపాలను వెలిగించి, టపాకాయలను కాలుస్తారు. ఇలా ఎవరైతే చేస్తారో వారి పితృదేవతలకు నరకబాధ తొలగుతుందని హిందువులు నమ్ముతారు.
ఆశ్వయుజ బహుళ చతుర్దశినాడు రాత్రి రెండోజాములో నరకాసురిని సంహారం జరిగింది కాబట్టి మూడో జాములో అభిషేకస్నానం చేసేవారికి నరకబాధ లభిస్తుందని శాస్త్రవచనం.
సాయంకాలం సమయంలో ఇంట్లో వున్న దేవుడి మందిరంలోనూ లేదా ఏదైనా దేవాలయంలో దీపారాధన చేయడం చాలా మంచిది.
భూమి మీద ఒకప్పుడు అందరికీ వెలుగు అందకుండా దూరం చేసిన వాడొకడు ఉండేవాడట. అందుకే వాడు చనిపోతే అందరూ కరువుతీరా దీపాలు వెలిగించుకుని తమ సంతోషాన్ని వ్యక్తం చేసుకున్నారు. ఎన్నో వరుసలలో దీపాలు వెలిగించుకున్నారు కనుక ఈ వేడుకని దీపావళి అన్నారు. లోకంలో కావలసిన వాటిని, కోరుకోదగిన వాటిని వెలుగుగాను, పనికి రాని వాటిని, హాని కలిగించేవాటిని చీకటిగానూ చెబుతుంటాము.
అవిద్య, అజ్ఞానం, అనారోగ్యం, దుఃఖం, బాధ, చికాకు, దరిద్రం, అపకీర్తి, అవమానం, పాపం మొదలైన మనిషి నాశనానికి, నిరాశానిస్పృహలకి హేతువులైనవన్నీ చీకటిగానూ, జ్ఞానం, ఆరోగ్యం, సంతోషం, ఆనందం, ఆహ్లాదం, కీర్తి, పుణ్యం మొదలైన మానవునికి కోరుకోదగిన, ఉపయోగపడేవన్నీ వెలుగుగానూ సంకేతించారు. ఈ దీపావళి రోజున లక్ష్మీ దేవిని పూజిస్తారు. లక్ష్మీ దేవికి శ్రీ అని పేరు. శ్రీ అంటే ఆశ్రమం ఇచ్చేది, ఆశ్రయింపబడేది. తన గునాల చేత వ్యాపించేది. దోషాలను తొలగించేది. మన మాటలు వినేది, వినిపించేది. ఈ ఆరు లక్షణాలు లక్ష్మీ దేవికి ఉన్నాయి.
ఇవి స్త్రీ లోనూ కనిపిస్తాయి. తండ్రీ, భర్త, పిల్లలూ కుటుంబ జీవనంలో భాగంగా అంటూ మహిళ క్రమశిక్షణను తెలియజేస్తుంది. పిల్లలూ, కుటుంబ సభ్యుల చేత ఆశ్రయించబడుతుంది. సమాజంలో ఉన్న దోషాలను తొలగించడంలోనూ మహిళ పాత్ర కీలకం. వ్యక్తిత్వం, వాత్సల్యం, ఎదుటి వాళ్ళకు మాట్లడటాన్ని, సంస్కారాన్నీ నేర్పిస్తుంది స్ర్తీ అందుకే ఈ రోజు లక్ష్మీ దేవికి పూజ చేస్తారు.
నరకాసురుణ్ని సత్యభామ చంపడంతో లోకాలకు శాంతి చేకూరుతుంది. ఆ సంతోషాన్ని దీపాలు వెలిగించి, ఈ లోకానికి వెలుగు వచ్చిందనే సంతోషంలో ఈ దీపావళిని జరుపు కుంటారు. దీనిని ధన త్రయోదశి, నరక చతుర్ధశి, దీపావళి, బలి పాడ్యమి, భగినీ ద్వితీయ పేరుతో ఐదు రోజులు చేసుకుంటారు.
శరీరంలోని పంచ కోశముల శుద్ధీ, పంచేంధ్రియాల సాధన ఇదే అసలైన దీపావళి అంతరార్ధం. నరకుడు విర్రవీగే అహంకారానికి నిదర్శనం సత్యభామ స్ర్తీకి ప్రతీక. ఆమె భూదేవి అవతారం. అందుకే నరకాసురుణ్ని చంపి ఇంద్రుడి ఛత్రం, కుండలాలు వెతికి తీసుకొచ్చింది. ఛత్రం అంటే అధికారం. కుండలాలు అంటే శాస్త్రం.
ప్రపంచంలోని అన్ని దేశాలవారు, అన్ని జాతులవారు ఏదో ఒక సందర్భంలో దీపాల పండుగ చేసుకుంటారు. ప్రతిమనిషి గుండెలోని, సమాజంలోని అన్ని విధాలైన చీకట్లను పోగొట్టి, సకల శుభాలను, సుఖసంతోషాలను, ఆనందోత్సాహాలను విజయ దీపావళి నింపాలని కోరుకుందాం.
దీపావళి పండుగకు ముందు రోజయిన ఆశ్వయుజ బహుళ చతుర్దశిని ‘‘నరక చతుర్దశి’’ అంటారు. హిందువులలో నిర్వహించుకునే ముఖ్య పండుగలలో నరక చతుర్దశి, దీపావళి ఎంతో ముఖ్యమైనవి. ఒక రాక్షసుడ్ని చంపి, ఎంతో ఆనందంగా పండుగను చేసుకోవడమే ఈ నరక చతుర్దశి ప్రత్యేకత.
విశేషాలు:
నరక చతుర్దశి పండుగకు - ఖగోళ సంఘటనలకు చాలావరకు సంబంధం వుంది. నరకాసుర వధ - చతుర్దశినాడు ఆకాశంలో రాసులస్తితిని సూచిస్తుంది. తులారాశి తూర్పు క్షితిజం మీద ఉదయిస్తుంటే పడమటి క్షితిజం మీద మేషరాశి అస్తమిస్తుంటుంది.
నరకాసురుడు భూదేవి కొడుకు. మేషం మంచిదే అయినా ముర్ఖత్వమూర్తి. అందుకే అతని పాలన అంధకారమయం! ఆరోజు మేషరాశి సూర్యాస్తమయ సమయంలో ఉదయిస్తుంది. అది అస్తమించే వరకు చీకటిగానే వుంటుంది. మేష రాశి అస్తమించే వేళకు తులారాశి తూర్పు దిక్కున క్షితిజం మీదికి వస్తుంది.
స్వాతి నక్షత్రానికి వాయువు దేవత. దానిని అధిష్టించి, నరకుని మీదకు కృష్ణుడు - సూర్యుడు, సత్యభామ-చంద్రుడు బయలుదేరుతారు. నరకుడు చనిపోగానే ఆకాశపు అంచులపై దీపచ్చాయాల్లో కన్యారాశి (కన్యల గుంపు) నరకుని బంధాలనుంచి విముక్తి పొంది, తమను విడిపించిన సూర్యున్ని - కృష్ణున్ని నాయకునిగా చేసుకున్నాయి. ఇలాంటి స్థితి నరక చతుర్దశి, దీపావళి రోజుల్లో తప్ప మిగిలిన రోజుల్లో లేదు.
కథ:
హిరణ్యాక్షుడు లోకానికి ఉపద్రవంగా భూలోకానికి చుట్టుచుట్టి సముద్రంలో ముంచినప్పుడు విష్ణుమూర్తి వరాహా అవతారం ఎత్తి ఆ రాక్షసున్ని సంహరించి, భూమిని కాపాడుతాడు. ఆ సందర్భంగా భూదేవికి విష్ణుమూర్తికి వరప్రసాదం వల్ల భీముడు అనే పుత్రుడు జన్మించాడు. అతడే నరకాసురుడిగా పేరు పొందాడు.
నరుకుడు ప్రాగ్జోతిషపురం రాజధానిగా కాపరూప రాజ్యాన్ని పాలిస్తుండేవాడు. భూమాత తన కుమారుని రాక్షసత్వానికి దూరంగానే పెంచింది. కానీ దురదృష్టవశాత్తూ నరకాసురుడు అసుర ప్రభావంలోపడి ఘోరతపస్సు చేసి, అనేక వరాలు పొందుతాడు. తనకు తన తల్లి చేతిలో తప్ప మరణం సంభవించకూడదని కూడా వరం పొందాడు.
దాంతో అతడు ఇష్టంవచ్చిన విధంగా దుష్కార్యాలు చేయసాగాడు. అవి పరాకాష్టకు చేరి దేవతలకు తీవ్ర అశాంతికి గురి చేశాయి. దేవమాత అదితి కర్ణ్భారణాలను, వరుణ ఛత్రాన్ని అపహరిస్తే శ్రీకృష్ణుడు ఇతనిని ద్వందయుద్ధంలో ఓడించి, తిరిగి అదితికి అందజేశాడు.
అయితే ఇతను ఓటమి ఒప్పుకోక మరొకసారి మదుపుటేనుగు రూపంలో విశ్వకర్మ పుత్రికను చేరపట్టాడు. విచక్షణారహితంగా గంధర్వ, దేవ, మానవ కన్యలను అపహరించి, తన అంత:పురంలో వున్న పంజరంలో బంధించడం మొదలుపెట్టాడు. ఇది అతను వ్యసనంగా మార్చుకున్నాడు.
ఇంతటితో ఆగకుండా ఇంద్రునిపై కూడా దండెత్తి ఆయన అధికార ముద్రను అపహరించాడు. దీంతో ఇంద్రుడు శ్రీకృష్ణుడిని వేడుకోగా నరుకునిపై దండెత్తాడు.
ఆ సమయంలో నరకాసురుడు శ్రీకృష్ణుడి మీద విషపు బాణాన్ని ప్రయోగిస్తాడు. దీంతో కృష్ణుడు స్పృహ కోల్పోగా పక్కనే వున్న సతీమణి సత్యభామ ఆ బాణాన్ని చూసి ఉగ్రరాలై భయంకరమైన ఒక బాణాన్ని ప్రయోగించి నరకాసురుడిని సంహరించింది. అయితే యాదృచ్ఛికంగా నరకాసురుని మరణం సత్యభామ రూపంలో తన తల్లి భూదేవి చేతిలోనే సంభవించింది.
Diwali, also spelled Divali, one of the major religious festivals in Hinduism, lasting for five days from the 13th day of the dark half of the lunar month Ashvina to the second day of the light half of Karttika. (The corresponding dates in the Gregorian calendar usually fall in late October and November.) The name is derived from the Sanskrit term dipavali, meaning “row of lights,” which are lit on the new-moon night to invite the presence of Lakshmi, the goddess of wealth. In Bengal, however, the goddess Kali is worshipped, and in north India the festival also celebrates the return of Rama, Sita, Lakshmana, and Hanuman to the city of Ayodhya, where Rama’s rule of righteousness would commence.
During the festival, small earthenware lamps filled with oil are lit and placed in rows along the parapets of temples and houses and set adrift on rivers and streams. The fourth day—the main Diwali festival day and the beginning of the lunar month of Karttika—marks the beginning of the new year according to the Vikrama calendar. Merchants perform religious ceremonies and open new account books. It is generally a time for visiting, exchanging gifts, cleaning and decorating houses, feasting, setting off fireworks displays, and wearing new clothes. Gambling is encouraged during this season as a way of ensuring good luck for the coming year and in remembrance of the games of dice played by the Lord Shiva and Parvati on Mount Kailasa or similar contests between Radha and Krishna. Ritually, in honour of Lakshmi, the female player always wins.
Diwali is also an important festival in Jainism. For the Jain community, the festival commemorates the passing into nirvana of Mahavira, the most recent of the Jain Tirthankaras. The lighting of the lamps is explained as a material substitute for the light of holy knowledge that was extinguished with Mahavira’s passing.
Since the 18th century, Diwali has been celebrated in Sikhism as the time Guru Hargobind returned to Amritsar from a supposed captivity in Gwalior—apparently an echo of Rama’s return to Ayodhya. Residents of Amritsar are said to have lighted lamps throughout the city to celebrate the occasion.
Over the centuries, Diwali has become a national festival that's also enjoyed by non-Hindu communities. For instance, in Jainism, Diwali marks the nirvana, or spiritual awakening, of Lord Mahavira on October 15, 527 B.C.; in Sikhism, it honors the day that Guru Hargobind Ji, the Sixth Sikh Guru, was freed from imprisonment. Buddhists in India celebrate Diwali as well.
Once upon a time there was a great warrior, Prince Rama, who had a beautiful wife named Sita.
There was also a terrible demon king, Ravana. He had twenty arms and ten heads, and was feared throughout the land. He wanted to make Sita his wife, and one day he kidnapped her and took her away in his chariot. Clever Sita left a trail of her jewellery for Rama to follow.
Rama followed the trail of glittering jewellery until he met the monkey king, Hanuman, who became his friend and agreed to help find Sita. Messages were sent to all the monkeys in the world, and through them to all the bears, who set out to find Sita.
After a very long search, Hanuman found Sita imprisoned on an island. Rama's army of monkeys and bears couldn't reach the island, so they began to build a bridge. Soon all the animals of the world, large and small, came to help. When the bridge was built, they rushed across it and fought a mighty battle.
When Rama killed the evil Ravana with a magic arrow, the whole world rejoiced. Rama and Sita began their long journey back to their land, and everybody lit oil lamps to guide them on their way and welcome them back.
Ever since, people light lamps at Diwali to remember that light triumphs over dark and good triumphs over evil.
0 Comments