Ad Code

కార్యసిద్ధి గణపతి పూజ

కార్యసిద్ధి గణపతి పూజ



అన్ని పనులు జగతున్నట్లు అనిపించినా ఎదో ఒక ఆటంకం కలగటం ఆగిపోవడం ఇలాంటి సమస్యకు, ఈ పూజ చాలా ఉపయోగకరమైనది. గృహంలో ఏదైనా దోషం ఉన్నా,
ఏదైనా చాలా పెద్ద కార్యం కానీ, వ్యాపారం మొదలు పెట్టాలి అనుకున్నాప్పుడు ముందుగా ఈ విధంగా చేసి మొదలు పెట్టడం వల్ల వారికి ఏ ఆటంకాలు ఉన్నా తొలగి పోతుంది. ఎలా చేయాలో తెలుసుకుందాము.

చాలా చిన్న పరిమితి లో ఉన్న వినాయక ఉగ్రహం పళ్లెం లో ఉంచి, ముందుగా నీటి తో అభిషేకం చేయాలి తర్వాత పాలతో , మళ్ళీ మూడో సారి నీటితో అభిషేకం చేయాలి. ఇలా చేస్తున్నపుడు మహా గణాధిపతియే నమః అనుకుంటూ చేయాలి.

బెల్లం, పోకచెక్కలు, నైవేద్యంగా పెట్టి, గంధం పొడి తో వినాయకుడికి అష్టోత్రం చదవుతు అర్చన చేయాలి. చివరికి 21 సార్లు " వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురమే దేవా సర్వకార్యే సుసర్వదా! ఈ శ్లోకం చదివి హారతి ఇవ్వాలి

ఇలా 21 రోజులు ఆటంకం రాకుండా చేయాలి. 21 రోజు మహా నివేదన చేసి ఆ ప్రసాదం ఎవరుకైనా పంచాలి. ఇలా చేయడం వల్ల వినాయకుడి అనుగ్రహము కలిగి అన్ని విజ్ఞాలు తొలగి పోతుంది.

ఓం మహా గణాధిపతియే నమః





Post a Comment

0 Comments